మాల్దీవుల్లో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు రౌడీ హీరో విజయ్ దేవరకొండ , హీరోయిన్ రష్మిక మందన్న. దసరా వేడుకలు అనగానే అందరూ గ్రామాల్లోకి వెళ్తారు . బంధు మిత్రులతో సరదాగా గడుపుతారు …… కానీ స్టార్ లు అలాగే బాగా డబ్బున్నవాళ్ళు మాత్రం ఏమాత్రం అవకాశం దొరికిన దాన్ని దసరాగా మార్చుకుంటారు ….. ఇలా మాల్దీవులకు , లేదా ఇతర పర్యాటక ప్రాంతాలకు వెళ్తారు.
తాజాగా మాల్దీవులకు వెళ్లారు విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న. గతకొంత కాలంగా ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారు అంటూ రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే ఎప్పటికప్పుడు మాత్రం ఆ వార్తలను ఖండిస్తూనే ఉన్నారు. అయితే ఖండన ……. ఖండనే అలాగే ఇలా తిరగడం తిరగడమే ! అన్నట్లుగా ఉంది పరిస్థితి.
మాల్దీవులలో ఎంజాయ్ చేయడానికి పలువురు సినీ , రాజకీయ , వ్యాపార ప్రముఖులు వెళ్తుంటారు. ఇక అక్కడి వాతావరణంలో ఎంజాయ్ చేసాక చాలా రిఫ్రెష్ అవుతారు. అందుకే సెలబ్రిటీలు తప్పకుండా వెళ్లే మొట్టమొదటి టూరిస్ట్ ప్లేస్ మాల్దీవులు కావడం విశేషం. ఇపుడు అక్కడే ఉన్నారు విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న. దసరా సెలవులను సరదాగా గడిపి రానున్నారు.