సమంత – విజయ్ దేవరకొండ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కొత్త షెడ్యూల్ నవంబర్ లో జరుగనుంది. మాములుగా అయితే ఈపాటికి సినిమానే పూర్తి కావాలి. కానీ లైగర్ ఘోర పరాజయం పాలవ్వడంతో ఖుషి చిత్రం షూటింగ్ వాయిదా పడింది. లైగర్ దెబ్బ నుండి కోలుకోవడానికి చాలా రోజులే పట్టింది విజయ్ దేవరకొండ కు.
ఇంకా దాన్ని తలుచుకొని ఉంటే ఇబ్బందులు కాబట్టి ఖుషి సినిమా కోసం వచ్చే నెల నుండి డేట్స్ ఇచ్చాడట ఈ రౌడీ హీరో. ఇక సమంత కూడా వెంటనే డేట్స్ ఇవ్వడంతో ఖుషి సినిమా నవంబర్ నుండి సెట్స్ మీదకు వెళ్ళడానికి సిద్ధమైంది.
ఈ సినిమా రొమాంటిక్ ఫిల్మ్ అనే అంటున్నారు. గతంలో మహానటి చిత్రంలో విజయ్ దేవరకొండ సమంత కలిసి జంటగా నటించారు. కానీ ఆ సినిమాలో ఎక్కువగా స్క్రీన్ ప్రెజెన్స్ లేదు . కానీ ఈ సినిమాలో మాత్రం ఎక్కువ అవకాశం ఉంది. అలాగే రొమాంటిక్ సీన్స్ కూడా చాలానే ఉన్నాయట.