ఇళయ దళపతి విజయ్ హీరోగా నటించిన చిత్రం వారిసు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించిన విషయం తెలిసిందే. జనవరి 11 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ లభించాయి. వారిసు ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 220 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇక త్వరలోనే ఓటీటీ లోకి కూడా రానుంది. ఫిబ్రవరి 10 న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు.
విజయ్ మాస్ హీరో…… తమిళనాట రజనీకాంత్ తర్వాత అంతటి క్రేజ్ ఉన్న హీరో కావడంతో పెద్దగా కథ లేకపోయినా విజయ్ కున్న మాస్ ఇమేజ్ తో ఈ భారీ వసూళ్లు వచ్చాయి. విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించింది. ఇక కీలక పాత్రల్లో జయసుధ, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ , శరత్ కుమార్, కిక్ శ్యామ్ , యోగిబాబు తదితరులు నటించారు. తమన్ సంగీతం అందించాడు. తమిళనాట పొంగల్ బరిలో విజేతగా నిలిచింది వారిసు చిత్రం దాంతో దిల్ రాజు చాలా చాలా సంతోషంగా ఉన్నాడు.
అయితే తెలుగులో మరిన్ని వసూళ్లు వస్తాయని అనుకున్నాడు కానీ చిరంజీవి, బాలకృష్ణ ల సినిమాలు విడుదల అవుతుండటంతో తన వారసుడు సినిమాను జనవరి 14 న విడుదల చేశాడు దాంతో పండగ వసూళ్లు మిస్ చేసుకున్నాడు.