ఎట్టకేలకు దిల్ రాజు తన వారసుడు సినిమాను వాయిదా వేసాడు. గత నెల రోజులుగా ఈ వివాదం ముదురుతోంది. సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ల సినిమాలు విడుదల అవుతుంటే ఆ సినిమాలకు పోటీగా దిల్ రాజు వారసుడు సినిమాను విడుదల చేయడం ఏంటి ? అని మండిపడుతున్నారు బాలయ్య , చిరంజీవి అభిమానులు. ఈ గోల దాదాపుగా నెల రోజుల నుండి సాగుతూనే ఉంది. బాలయ్య వీర సింహా రెడ్డి జనవరి12 న విడుదల అవుతుండగా చిరంజీవి వాల్తేరు వీరయ్య జనవరి 13 న విడుదల అవుతోంది.
ఇద్దరు అగ్ర హీరోల చిత్రాలు ఒకరోజు తేడాతో విడుదల అవుతుండటంతో థియేటర్ ల సమస్య తలెత్తుతోంది. ఉన్న థియేటర్లు ఈ ఇద్దరికే సరిపోవు ఇక వీటికి పోటీగా విజయ్ హీరోగా నటించిన వారసుడు చిత్రంతో పాటుగా అజిత్ హీరోగా నటించిన తెగింపు చిత్రం కూడా విడుదల అవుతుండటంతో థియేటర్ల సమస్య తీవ్రమైంది. తెలుగు చిత్రాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా డబ్బింగ్ చిత్రాలకు ప్రాధాన్యత ఇవ్వడం ఏంటి ? అని పెద్ద ఎత్తున నిరసనలు , అభిమానుల హెచ్చరికలు రావడంతో ఎట్టకేలకు దిల్ రాజు తలొగ్గారు. నిన్న మొన్నటి వరకు తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరించిన దిల్ రాజు ఈరోజు మీడియా ముందుకు వచ్చి వారసుడు చిత్రాన్ని జనవరి 14 కు వాయిదా వేస్తున్నట్లు గా ప్రకటించాడు. దాంతో థియేటర్ల సమస్య కొలిక్కి వచ్చినట్లే .