ఇళయ దళపతి విజయ్ హీరోగా నటించిన చిత్రం వారసుడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మించిన సంగతి తెలిసిందే. తెలుగు , తమిళ భాషలతో పాటుగా హిందీ , మలయాళ భాషల్లో కూడా విడుదల అవుతోంది. జనవరి 12 న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అవుతున్న ఈ చిత్ర ట్రైలర్ ను ఈనెల 5 న విడుదల చేయనున్నారు.
వారసుడు గా తెలుగులో వస్తున్న ఈ సినిమా వారిసు గా తమిళ్ లో విడుదల కానుంది. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చారు సెన్సార్ సభ్యులు. తమిళనాట విజయ్ నెంబర్ వన్ హీరో అనే విషయం తెలిసిందే. దాంతో అక్కడ భారీ ఓపెనింగ్స్ దక్కడం ఖాయం. అయితే తెలుగులో విజయ్ కి అంతగా మార్కెట్ లేదు అనే చెప్పాలి.
విజయ్ సరసన రష్మిక మందన్న నటించింది. ఇక ఈ సినిమాకు తమన్ సంగీతం అందించాడు. ట్రైలర్ రెడీ అంటూ ట్వీట్ చేసాడు తమన్. వారసుడు ట్రైలర్ కూడా అద్భుతంగా వచ్చిందట. అంతేకాదు హీరో రాంచరణ్ కూడా ఈ చిత్రాన్ని చూశాడట. చాలా బాగుందని దర్శక నిర్మాతలకు చెప్పాడట చరణ్. అసలు విషయం ఏంటంటే అసలు ఈ సినిమా చరణ్ తో చేద్దామని కూడా అనుకున్నాడట దిల్ రాజు. కానీ చేయలేకపోయాడు….. ఎందుకంటే విజయ్ కి చెప్పగానే వెంటనే చేద్దామని మరో మాట లేకుండా చెప్పాడట దాంతో విజయ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు దిల్ రాజు.