ఇళయ దళపతి విజయ్ హీరోగా నటించిన చిత్రం ” వారిసు ”. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించిన సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా తమిళనాట ఈరోజే విడుదల కాగా తెలుగులో మాత్రం జనవరి 14 న విడుదల కానుంది. ఇక తమిళనాట భారీ ఎత్తున విడుదలైన వారిసు షోలు పడ్డాయి. దాంతో టాక్ బయటకు వచ్చేసింది.
ఇంతకీ విజయ్ వారిసు టాక్ ఎలా ఉందో తెలుసా ……. పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అనే చెబుతున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయని , అయితే కథ , కథనం కొత్తదనం అంటూ ఏమి లేదని అంటున్నారు. కథలో కొత్తదనం లేకపోయినప్పటికీ , ప్రేక్షకులను అలరించేలా సెంటిమెంట్ , యాక్షన్ , ఎంటర్ టైన్ మెంట్ , సాంగ్స్ ఉండటంతో పండగకు పక్కా కమర్షియల్ సినిమా అని అంటున్నారు.
విజయ్ కు మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దాంతో వారిసు చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా భారీ ఓపెనింగ్స్ దక్కడం ఖాయం. అలాగే పండగకు పక్కాగా హిట్ కొడుతున్నామని ధీమాగా ఉన్నారు విజయ్ ఫ్యాన్స్. అలాగే నిర్మాత దిల్ రాజు కూడా వారిసు పక్కాగా సూపర్ హిట్ అయ్యే సినిమా అనే నమ్ముతున్నాడు. ఇక ప్రేక్షకుల తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.