39.9 C
India
Tuesday, April 21, 2026
More

    షూట్ కి బోటులో వెళ్లిన విజయ్

    Date:

    Vijay went to the shoot in a boat
    Vijay went to the shoot in a boat

    యంగ్ హీరో విజయ్ దేవరకొండ పడవలో కూర్చుని బోటింగ్ చేస్తున్న వీడియో వెలుగులోకి వచ్చింది. అయితే ఈ వీడియోను స్వయంగా విజయ్ తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో రైడ్ టూ వర్క్ ఇన్ కేరళ అని పోస్ట్ చేశారు. వీడియోలో విజయ్ బ్లాక్ కలర్ స్టెట్స్ పెట్టుకుని చేతిలో మొబైల్ పట్టుకుని పడవలో ప్రయాణిస్తుండటం వీడియోలో గమనించవచ్చు. ఈ క్రమంలో అతని స్టైలిష్ లుక్‌ చూసిన అభిమానులు రౌడీ, లుక్స్ సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకో వ్యక్తి చూసి అప్ కమింగ్ మూవీ ఖుషీ అని కామెంట్లు చేస్తున్నారు. అయితే వీడియోలో విజయ్ తన షర్టుకు పైన రెండు బటన్స్ ఓపెన్ చేసి ఉంచండం చూడవచ్చు. ఇది చూసిన నెటిజన్లు ఎందుకు బటన్స్ పెట్టుకోలేదని కామెంట్ల రూపంలో ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియో తన ఇన్ స్టాలో పోస్ట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే 5 లక్షలకుపైగా లైక్స్ రావడం విశేషం.

    రౌడీ హీరో విజయ్ దేవరకొండకు అర్జెంట్‌గా ఒక సాలిడ్ హిట్ కావాలి. ఎట్టి పరిస్థితుల్లోను లైగర్ ఫ్లాప్ నుంచి బయటపడాలని విజయ్ దేవరకొండ చూస్తున్నాడు. దాని కోసం ఎంత హార్డ్ వర్క్ చేసేందుకైనా రెడీగా ఉన్నాడు. అందుకే ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ‘ఖుషి’ సినిమాను పరుగులు పెట్టించాలనుకుంటున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్‌గా నటించింది. గతంలో విజయ్-సామ్ మహానటి సినిమాలో కీ రోల్ ప్లే చేశారు. దాంతో ఖుషి సినిమాతో ఈ జోడీ ఆకట్టుకోవడం పక్కా అంటున్నారు అభిమానులు. సెప్టెంబర్ 1, 2023న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

    ఇప్పటికే చాలాభాగం వరకు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రాన్ని..వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలనుకుంటున్నాడు రౌడీ. రిలీజ్ టైం దగ్గర పడే సమయంలో.. చివర్లో హడావిడిగా షూటింగ్ చేసే బదులు.. ముందుగానే ఖుషిని కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం సామ్ వరుస బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. అంతేకాదు ఏవో కొన్ని కారణాల వల్ల.. సామ్ సోషల్ మీడియాకు దూరంగా ఉంటుందని వినిపిస్తోంది. దీంతో అనుకున్న సమయంలో ఖుషి కంప్లీట్ అయ్యేలా లేదని సమాచారం. అయితే ఇలాంటి విషయాల్లో క్లారిటీ రావాల్సి ఉంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Nag Ashwin : నాని, విజయ్ దేవరకొండలకు నాగ్ అశ్విన్ అంటే ఎంతో ఇష్టం! మల్టీస్టారర్ వస్తుందా?

    Nag Ashwin : టాలీవుడ్‌లో ప్రస్తుతం యంగ్ హీరోల మధ్య గట్టి పోటీ...

    Vijay Devarakonda : డబుల్ యాక్షన్.. దిమ్మ తిరిగిపోయింది.. విజయ్ దేవరకొండ ఏం చేస్తాడో ఏమో

    Vijay Devarakonda : రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మూవీ...

    Vijay – Rashmika : రౌడీబాయ్‌కి జోడీగా మరోసారి నేషనల్ క్రష్.. ఖుష్ లో ఫ్యాన్స్..

    Vijay Devarakonda - Rashmika : సక్సెస్, ఫెయిల్యూర్స్ తో సంబంధం...