మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం ” విరూపాక్ష ”. కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్ తో కలిసి భోగవల్లి ప్రసాద్ నిర్మించాడు. సాయిధరమ్ తేజ్ సరసన సంయుక్త మీనన్ నటించగా కీలక పాత్రల్లో బ్రహ్మాజీ ,సునీల్ , అజయ్ తదితరులు నటించారు. ఈ సినిమా టీజర్ ఈరోజు సాయంత్రం విడుదల అయ్యింది.
ఓ గ్రామంలో జరుగుతున్న వింత సంఘటనలకు కారణం ఏంటి ? ఆ సమస్యలను నివారించడానికి ఉన్న పరిష్కారం ఏంటి ? అన్నది ఈ టీజర్ ద్వారా తెలుస్తోంది. టీజర్ ఆసక్తికరంగా ఉండటంతో సస్పెన్స్ చిత్రాలకు కలిసి వచ్చే అంశమని అనుకుంటున్నారు. ఇక సుకుమార్ ఈ సినిమాలో భాగస్వామి కావడంతో తప్పకుండా బాగుంటుందని భావిస్తున్నారు.
ఏప్రిల్ 21 న ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రమోషన్స్ ప్రారంభించారు. మెగా మేనల్లుడు కావడంతో మేనల్లుడి కోసం పవన్ కళ్యాణ్ ఈ ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు. తాజాగా పవన్ కళ్యాణ్ – సాయిధరమ్ తేజ్ కలిసి ఓ తమిళ రీమేక్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.