
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ సినిమా ల్లో ఆదిపురుష్ ఒకటి. అయోధ్యలో గ్రాండ్‌గా రిలీజ్ చేసిన టీజర్‌కు నెగిటివ్ ఫీడ్ బ్యాక్ రావడంతో.. మళ్లీ గ్రాఫిక్స్ రీ వర్క్ జరుగుతోంది. అందుకోసం సినిమాను ఆరు నెలలు పోస్ట్‌పోన్ చేశాడు డైరెక్టర్ ఓం రౌత్. ప్రభాస్ ఫ్యాన్స్ కు విజువల్ ట్రీట్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు రావడం హాట్ టాపిక్ గా మారింది.
రామాయణం ఆధారంగా తెరకెక్కుతోన్నఆదిపురుష్ మూవీ కోసం యావత్ సినీ ప్రేమికులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన కొన్ని పోస్టర్స్ పై నెగిటివిటి ఉన్నప్పటికి… ఆ మధ్య హనుమాన్ జయంతి రోజు రిలీజైన పోస్టర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇదిలా ఉంటే.. ఈమూవీలో కొన్ని సన్నివేశాలు ఆడియెన్స్ కు గూస్‌బంప్స్ తెప్పించే విధంగా ఉంటాయని మేకర్స్ చెబుతుండటంతో సినిమాపై క్యూరియాసిటి పెరుగుతోంది. అంతేకాక వాలి-సుగ్రీవుల మధ్య జరిగే యాక్షన్ సీక్వెన్స్ నెక్ట్స్ లెవెల్‌లో ఉండనున్నాయట. అంతేకాక ఈ సీక్వెన్స్‌లో వచ్చే యాక్షన్, వీఎఫ్ఎక్స్‌లు ప్రేక్షకులకు అల్టిమేట్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వనున్నాయట. రిలీజ్ టైం దగ్గర పడుతుండటంతో అదిరిపోయే డీల్ ను కుదుర్చుకున్నట్లు ఓ వార్త తెగ హల్ చల్ చేస్తోంది.
ఇక ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అవుతోంది. ప్రమోషన్స్ ను గట్టిగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇదిలా ఉంటే… ఆదిపురుష్ ఓవర్సీస్ రైట్స్‌ను పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ సంస్థ ఏఏ ఫిల్మ్స్ సొంతం చేసుకుందట. అదిరిపోయే రేటుకు ఓవర్సీస్ రైట్స్‌ను దక్కించుకున్నారట.దీంతో మేకర్స్ ఈ సినిమాను ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీత పాత్రలో నటిస్తోంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ లంకేశ్ పాత్రలో నటిస్తుండగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా నటిస్తున్నాడు.జూన్ 16న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.






