26.9 C
India
Friday, February 14, 2025
More

    VVVINAYAK- JR. NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు షాకిచ్చిన వినాయక్

    Date:

    vvvinayak-jr-ntr-vinayak-who-shocked-ntr-fans
    vvvinayak-jr-ntr-vinayak-who-shocked-ntr-fans

    మాస్ దర్శకులు వివినాయక్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పిచ్చ షాక్ ఇచ్చాడు. అదుర్స్ చిత్రానికి సీక్వెల్ కావాలని చాలా సంవత్సరాలుగా అడుగుతున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఇక వినాయక్ -ఎన్టీఆర్ లు కూడా చాలా సంవత్సరాలుగా ఆ సీక్వెల్ కోసం కథలు వింటూనే ఉన్నారు. అయితే వినాయక్ కు రెండు కథలు నచ్చాయట అవి ఎన్టీఆర్ కు చెబితే రిజెక్ట్ చేసాడట. దాంతో ఇక అదుర్స్ 2 లేదని కుండబద్దలు కొట్టాడు వినాయక్.

    అదుర్స్ అనే సినిమా 2010 లో విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఆ చిత్రంలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం పోషించాడు. ముఖ్యంగా బ్రాహ్మణ యువకుడిగా ఎన్టీఆర్ అభినయం నభూతో నభవిష్యత్ అనే చెప్పాలి. ఇక యాక్షన్ తో పాటుగా కావాల్సినంత ఎంటర్ టైన్ మెంట్ పుష్కలంగా ఉన్న సినిమా అదుర్స్. దాంతో ఆ సినిమాకు సీక్వెల్ చేయాలని గట్టిగానే ప్లాన్ చేసారు కానీ సరైన కథ దొరక్కపోవడంతో ఇక సీక్వెల్ ని పక్కన పెట్టినట్లు ప్రకటించాడు వినాయక్.

    ఈ మాటతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాధపడటం ఖాయం. ఎందుకంటే ఎన్టీఆర్ కు మాస్ ఇమేజ్ రావడానికి కారకులు వినాయక్. ఎన్టీఆర్ – వినాయక్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా ఆది. ఆ సినిమా ఇండస్ట్రీ రికార్డులను బద్దలుకొట్టింది. అలాగే ఎన్టీఆర్ కు ఊహించని ఇమేజ్ ని తెచ్చిపెట్టింది. దాని తర్వాత సాంబ అనే చిత్రం చేసారు. అది కూడా మంచి కథే . అయితే ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇక ఆ తర్వాత అదుర్స్ అనే చిత్రం చేసారు. అదుర్స్ సూపర్ హిట్ అయ్యింది. మూడు చిత్రాల తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ – వినాయక్ ల కాంబినేషన్ లో సినిమా రాలేదు . ఈ కాంబినేషన్ లో సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పట్లో వీలయ్యేలా కనిపించడం లేదు.

    Share post:

    More like this
    Related

    PM Modi : అమెరికా నుంచి అక్రమ వలసదారుల్ని భారత్‌కు తీసుకొస్తాం: ప్రధాని మోదీ

    PM Modi :  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ విడతగా...

    KCR : 19న ఫామ్‌హౌస్ నుంచి బయటకు కేసీఆర్ !

    KCR : భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ మళ్లీ రాజకీయాల్లో...

    Jagan : కేడర్ కోసం జగన్ కీలక నిర్ణయం – ఇక నుంచి..!!

    Jagan : మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ అధికారంలో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    JR NTR: క్రేజీ.. ఆ ముగ్గురి కాంబో సెట్ అయినట్లేనా ?

    JR NTR: తమిళ దర్శకుల దృష్టి ప్రస్తుతం తెలుగు...

    NTR : పెద్ద  ఎన్టీఆర్ ను కలవడానికి జూనియర్‌కు ఎన్నేళ్లు పట్టిందో తెలుసా? కారణాలేంటి?

    Sr. NTR : తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు...

    JR. NTR : నిరాధార ఆరోప‌ణ‌లు చేస్తుంటే మౌనంగా ఉండలేం.. కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌పై ఎన్‌టీఆర్‌

    JR. NTR  : నాగ చైతన్య-సమంతల విడాకులపై మంత్రి కొండా సురేఖ...