మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ మారింది. వైజాగ్ బీచ్ లో అంగరంగ వైభవంగా ఈ వేడుక జరపాలని అనుకున్నారు చిత్ర బృందం. అయితే జగన్ ప్రభుత్వం చిరంజీవికి షాక్ ఇచ్చింది. బీచ్ లో ఈవెంట్ కుదరదు మరోచోటుకు మార్చుకోండి అంటూ చెప్పేసారికి చేసేదిలేక మార్చారు. వైజాగ్ బీచ్ లో కాకుండా ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్స్ లో వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనుంది.
ఇక ఈ వేడుక జరిగేది ఎప్పుడో తెలుసా…… జనవరి 8 న . అవును వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 8 న మెగా అభిమానుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరుగనుంది. వాల్తేరు వీరయ్య వైజాగ్ నేపథ్యంలో రూపొందుతున్న సినిమా కావడంతో వైజాగ్ పరిసర ప్రాంతాల్లోనే ఈ వేడుక నిర్వహించాలని భావించారు. అందుకే అక్కడే నిర్వహిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి సరసన శ్రుతి హాసన్ నటించగా కీలక పాత్రలో మాస్ మహరాజ్ రవితేజ నటిస్తున్నాడు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రంలోని పాటలు సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. జనవరి 13 న విడుదల అవుతున్న వాల్తేరు వీరయ్య చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.