మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య ఎట్టకేలకు 50 రోజులను పూర్తి చేసుకుంది. 2023 సంక్రాంతి కానుకగా జనవరి 13 న భారీ ఎత్తున విడుదలైంది వాల్తేరు వీరయ్య. ఈ సినిమా పరమ రొటీన్ కథ అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించి ట్రేడ్ విశ్లేషకులను ఆశ్యర్యానికి లోనయ్యేలా చేసింది. ఎందుకంటే మాములు సినిమా అయినప్పటికీ 300 కోట్ల వసూళ్లను సాధించడం అంటే మాటలు కాదు కదా !
బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా రవితేజ కీలక పాత్రలో నటించాడు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా పలువురు నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. ఓవర్ సీస్ , రాయలసీమ , నైజాం , ఆంధ్రా , రెస్ట్ ఆఫ్ ఇండియా అనే తేడా లేకుండా అన్ని చోట్లా వసూళ్ల వర్షం కురిపించింది వాల్తేరు వీరయ్య. మెగాస్టార్ చిరంజీవి నటజీవితంలోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది వాల్తేరు వీరయ్య.