మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ” వాల్తేరు వీరయ్య ”. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా జనవరి 13 న భారీ ఎత్తున విడుదలైన వాల్తేరు వీరయ్యకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దాంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 250 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.
కట్ చేస్తే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది. నెట్ ఫ్లిక్స్ లో ఈనెల 27 న స్ట్రీమింగ్ కి వస్తోంది. ఆమేరకు నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది. దాంతో మెగా అభిమానులు పులకించి పోతున్నారు. ఇప్పటికే థియేటర్ లలో ఈ సినిమాను చూసారు ప్రేక్షకులు , అయితే ఇంకా చూడని వాళ్లకు ఇదొక మంచి అవకాశం అన్నమాట.
చిరంజీవి , రవితేజ , శృతి హాసన్ తదితరులు నటించిన ఈ సినిమా పక్కా మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందింది దాంతో సంక్రాంతి పండగకు సరైన సినిమా అనిపించింది దాంతో వసూళ్ల వర్షం కురిసింది. మెగాస్టార్ చిరంజీవి ఖాతాలో ఇది నెంబర్ వన్ గా నిలిచింది. అలాగే రవితేజకు కూడా బ్యాక్ టు బ్యాక్ హిట్ గా నిలిచింది వాల్తేరు వీరయ్య. మైత్రి మూవీ మేకర్స్ కు భారీగా లాభాలను తెచ్చిపెట్టింది వాల్తేరు వీరయ్య.