మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య 130 కోట్ల క్లబ్ లో చేరింది. జనవరి 13 న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అలాగే ఓవర్ సీస్ లో కూడా మంచి వసూళ్లు వస్తున్నాయి. పక్కాగా మాస్ మసాలా చిత్రంగా రూపొందినప్పటికీ సంక్రాంతి బాగా కలిసొచ్చింది.
అలాగే మెగాస్టార్ చిరంజీవి కున్న మాస్ ఇమేజ్ తో ఈ చిత్రానికి భారీ వసూళ్లు వస్తున్నాయి. ఓవర్ సీస్ లో 2 మిలియన్ డాలర్లకు చేరువలో ఉంది. ఇక ఓవరాల్ గా ప్రపంచ వ్యాప్తంగా 130 కోట్ల వసూళ్లను దాటేసింది. ఇక ఇదే జోరు ముందు కూడా కొనసాగితే అవలీలగా 150 కోట్లను దాటడం ఖాయం.
చిరంజీవి సరసన శృతి హాసన్ నటించగా కీలక పాత్రలో మాస్ మహారాజ్ రవితేజ నటించాడు. చిరంజీవి – రవితేజ కాంబినేషన్ లో వచ్చిన సన్నివేశాలు మెగా అభిమానులను విశేషంగా అలరించాయి. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.