
వాల్తేరు వీరయ్య వేదికను అటుతిరిగి ఇటుతిరిగి మళ్ళీ అక్కడికే మార్చారు. దాంతో తీవ్ర గందరగోళం నెలకొంది. పైగా అటు మార్చడం , ఇటు మార్చడం వల్ల ఆర్ధికంగా కూడా చాలా నష్టమే జరిగింది. మొదట వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ ను వైజాగ్ లోని ఆర్కే బీచ్ లో చేయాలని అనుకున్నారు …… అనుమతి కూడా తీసుకున్నారు.
అయితే ఇటీవల చంద్రబాబు పర్యటనలో విషాదకర సంఘటనలు చోటు చేసుకోవడంతో జీవో నెంబర్ 1 తీసుకొచ్చారు. ఆ జీవో ప్రకారం ఆర్కే బీచ్ లో పనులు చేస్తుండగా వద్దని చెప్పి అక్కడి నుండి ఆంధ్రా యూనివర్సిటీకి మార్చారు. దాంతో ఆర్కే బీచ్ లో పనులు నిలిపివేసి ఆంధ్రా యూనివర్సిటీలో పనులు చేయడం మొదలు పెట్టారు.
తీరా సమయానికి ఆంధ్రా యూనివర్సిటీలో వద్దు ఆర్కే బీచ్ లోనే చేసుకోండని చెప్పడంతో నిర్వాహకులు షాక్ అయ్యారు. అయితే పోలీసులు చెప్పిన దానికి అంగీకరించడం మినహా మరో దారి లేదు కాబట్టి మళ్ళీ ఆర్కే బీచ్ లో పనులు ప్రారంభించారు. అలా వాల్తేరు వీరయ్య కు ఏపీ పోలీసులు చుక్కలు చూపించారు. మొత్తానికి రేపు ఆర్కే బీచ్ లో వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ ఎత్తున జరుగనుంది.