మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం ” వాల్తేరు వీరయ్య ”. బాబీ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో మరో హైలెట్ ఏంటంటే ……. మాస్ మహారాజ్ రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా స్పెషల్ అప్పియరెన్స్ ఇస్తుండటం. ఇటీవలే రవితేజ టీజర్ వదిలి సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేలా చేసారు మేకర్స్.
2023 జనవరి 13 న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది వాల్తేరు వీరయ్య చిత్రం. దాంతో విశాఖపట్టణంలో ఈనెల ఆఖరున ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. వైజాగ్ కు స్పెషల్ ట్రైన్స్ ఏర్పాటు చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవికి పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. దాంతో మెగా అభిమానులు ఈ వేడుకకు ఆహ్వానించేలా ప్లాన్ చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవితో పాటుగా కేథరిన్ ట్రెసా , నివేతా పెతు రాజ్ , బాబీ సింహా , ఊర్వశి రౌటేలా తదితరులు ఈ చిత్రంలో నటించనున్నారు. ఐటెం భామ ఊర్వశి రౌతేలా ఐటెం సాంగ్ ఈ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలవడం ఖాయమని భావిస్తున్నారు. అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ కూడా పిచ్చెక్కించడం ఖాయమని భావిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. సినిమా విడుదలకు దాదాపు నెల రోజుల సమయం ఉండటంతో గట్టి ప్లాన్ లు చేస్తున్నారట వాల్తేరు వీరయ్య బృందం.