మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య. జనవరి 13 న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయ్యింది. మెగాస్టార్ సినిమా కావడం , సంక్రాంతి పండగ కావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ఓవర్సీస్ లో షోలు ముందుగానే పడ్డాయి…… దాంతో టాక్ కూడా వచ్చేసింది. ఈ సినిమాను చూసిన వాళ్ళు ట్విట్టర్ లో తమ రివ్యూ ఇస్తున్నారు.
ఇంతకీ ట్విట్టర్ రివ్యూ ప్రకారం వాల్తేరు వీరయ్య ఎలా ఉందో తెలుసా……. పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది. అయితే ఇదే సమయంలో నెగెటివ్ టాక్ కూడా వినిపిస్తోంది. ఫస్టాఫ్ బాగుందని , కానీ సెకండాఫ్ ఆశించిన స్థాయిలో లేదని అంటున్నారు. ఓవరాల్ గా ఈ పండగకు వాల్తేరు వీరయ్య పక్కా మాస్ మసాలా చిత్రమని తెలుస్తోంది. చిరంజీవి- రవితేజ ల మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని అంటున్నారు. దేవిశ్రీప్రసాద్ అందించిన పాటల్లో 2 పాటలు బాగున్నాయి. యాక్షన్ సీన్స్ తో మెగాస్టార్ రక్తి కట్టించారట. ఇక తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఎలాంటి తీర్పు ఇవ్వనున్నారనేది కొద్ది గంటల్లోనే తెలియనుంది.