
మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న చిత్రం వాల్తేరు వీరయ్య. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. వైజాగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం ఎట్టకేలకు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి U/ A సర్టిఫికెట్ ఇచ్చారు సెన్సార్ సభ్యులు. దాంతో జనవరి 13 న భారీ ఎత్తున వాల్తేరు వీరయ్య చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
మాస్ మహరాజ్ రవితేజ స్పెషల్ అప్పియరెన్స్ ఇస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన శ్రుతి హసన్ నటిస్తోంది. దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుండి 4 పాటలు విడుదల కాగా అన్ని పాటలు కూడా ప్రేక్షకులను అలరించేలా ఉన్నాయి. చిరంజీవి- రవితేజ కాంబినేషన్ కావడంతో మాస్ ప్రేక్షకులకు పూనాకలు తెప్పించడం ఖాయమని.భావిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గత ఏడాది చిరంజీవి నటించిన ఆచార్య అట్టర్ ప్లాప్ అయ్యింది. గాడ్ ఫాదర్ మంచి హిట్ అయ్యింది కానీ సాలిడ్ బ్లాక్ బస్టర్ కాదు. దాంతో మెగా అభిమానులు వాల్తేరు వీరయ్య పై చాలా ఆశలే పెట్టుకున్నారు.