36.9 C
India
Tuesday, April 21, 2026
More

    సుభాష్ చంద్రబోస్ కి ‘డెవిల్’ కు లింకేంటి?

    Date:

    What is Subhash Chandra Bose's link to 'Devil'?
    What is Subhash Chandra Bose’s link to ‘Devil’?

    జయాపజయాలతో సంబంధం లేకుండా కొత్తదనంతో సినిమాలు చేసుకుంటూపోయే హీరో నందమూరి కల్యాణ్ రామ్. చాలాకాలంగా హిట్ లేక కొట్టుమిట్టాడిన ఈ హీరో.. బింబిసార సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడు. ఆ సినిమా అనుకున్నదానికంటే ఎక్కువే విజయం సాధించడంతో తదుపరి మూవీలను చాలా జాగ్రత్తగా ఎంచుకుంటున్నాడు. ఈ క్రమంలో ఓ కొత్త కాన్సెప్ట్ తో అమిగోస్ అనే ఓ వైవిధ్యమైన సినిమాకు చేయగా.. అది కాస్తా నిరాశపరిచింది. అయినా ఢీలాపడకుండా నెక్స్ట్ డెవిల్ అనే ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ని లైన్ లో పెట్టేసాడు.

    టైటిల్ తోనే క్యూరియాసిటీ పెంచుతున్న ఈ డెవిల్ సినిమా గురించి తాజాగా ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ ఓ సీక్రెట్ ఏజెంట్ గా కనిపిస్తాడని ఇప్పటికే ప్రచారం జరుగుతుండగా… తన క్యారెక్టర్ సంబంధించి ఇంట్రెస్టింగ్ థింగ్ బయటకు వచ్చింది. ఈ కథ సుభాష్ చంద్ర బోస్ చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది.‌ నేతాజీ మృతి లేదా అదృశ్యానికి సంబంధించి కొన్ని అంశాలను ఇందులో ప్రస్తావించబోతున్నారని అంటున్నారు.

    1945 బ్రిటిష్ కాలంలో జరిగిన రియల్‌ ఇన్సిడెంట్స్‌ ఆధారంగా ఈ కథను రెడీ చేశారట మేకర్స్. అలా బ్రిటీష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌గా కళ్యాణ్ రామ్ కనిపించనున్నాడని, ఆయన చేసే సాహసాలు అబ్బురపరుస్తాయని చెబుతున్నారు. ఇకపోతే నేతాజీ సుభాష్ చంద్రబోస్… 18 ఆగష్టు 1945న మృతి చెందారు. అయితే ఇప్పటికీ సుభాష్ చంద్రబోస్ ఎలా మృతి చెందాడు అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతుండగా… అసలు బోస్ మరణించలేదనే వాదన కూడా ఉంది. అయితే అసలు మిస్టరీ ఏంటి..? అనే పాయింట్ ని డెవిల్ చిత్రంలో చూపిస్తారని టాక్ వినిపిస్తోంది చూడాలి మరి డెవిల్ ఏ రేంజ్ లో డేర్ చేస్తాడో..

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Devil Review : డెవిల్ రివ్యూ: పీరియాడిక్ యాక్షన్ డ్రామా..

    నటీనటులు: నందమూరి కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్, మాళవిక నాయర్, ఎడ్వర్డ్...

    Bimbisara : బింబిసార చక్రవర్తి గురించి తెలుసా? ఆయన జీవిత కథ తెలుసుకుందామా

    Bimbisara ఉత్తర భారతంలో మొదటి సామ్రాజ్యమైన ‘మగధ’ను స్థాపించిన చక్రవర్తి బింబిసారుడు....

    ‘Bimbhisara 2’ : ‘బింభిసార 2’కు అదరిపోయే డీల్! ఏకంగా రూ.100 కోట్లు

    'Bimbhisara 2' : బింభిసార’ కళ్యాణ్ రామ్ కు భారీ సక్సెస్...

    అజిత్ 62 చిత్రానికి టైటిల్ ఏంటో తెలుసా ?

    తమిళ స్టార్ హీరో అజిత్ తాజాగా 62 వ చిత్రాన్ని ఇటీవల...