31.9 C
India
Sunday, April 19, 2026
More

    ‘విరూపాక్ష’.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే!?

    Date:

    virupaksha movie
    virupaksha

    సాలిడ్ బజ్‌తో రిలీజ్ అయిన సినిమా విరూపాక్ష. సుకుమార్ శిష్యుడు కార్తిక్‌ దండూ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు.. సుకుమార్ స్క్రీన్ ప్లే అందించాడు. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించింది. దాంతో ముదు నుంచి విరూపాక్షపై మంచి బజ్ ఏర్పడింది. అందుకు తగ్గట్టే.. విరూపాక్ష మూవీ థియేటర్లోకి వచ్చాక అదిరిపోయే హిట్ టాక్ సొంతం చేసుకుంది. అంతేకాదు నటుడిగా సాయితేజ్‌ను మరో మెట్టు ఎక్కించిందనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

    మెగా మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ సాలిడ్ కంబ్యాక్‌ ఇచ్చాడనే చెప్పాలి. దాంతో ఈ చిత్రంపై ప్రేక్షకులతో పాటు హీరోలు, సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా సాయి ధరమ్‌ తేజ్‌కు, చిత్ర యూనిట్‌కు తన అభినందనలు తెలిపారు. ఇక ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా అదిరిపోయిందంటున్నాయి ట్రేడ్ వర్గాలు.రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.79 కోట్ల షేర్ రాబట్టగా.. 8.60 కోట్ల గ్రాస్ వచ్చినట్టు తెలుస్తోంది. ఇక రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ కలుపుకొని ప్రపంచ వ్యాప్తంగా 6.35 కోట్లు షేర్.. 11.85 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిందంటున్నారు. దీంతో సాయి ధరమ్ తేజ్ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా విరూపాక్ష నిలిచింది.

    ఈ సినిమా 23 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజ్ అయింది. ఈ టార్గెట్‌ సాయి ధరమ్‌కు మార్కెట్‌కి మించి ఉన్నప్పటికీ.. సినిమా సాలిడ్ టాక్ సొంతం చేసుకోవడంతో.. వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌ మార్క్‌ని టచ్ చేస్తుందని అంటున్నారు. మరి ఫైనల్ రన్‌లో విరూపాక్ష ఎలాంటి లాభాలు తెచ్చిపెడుతుందో చూడాలి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sharwa37 లో దియాగా సంయుక్త మీనన్..

    Sharwa37 : లక్కీ హీరోయిన్ సంయుక్త శర్వానంద్ తో కలిసి నటించబోతోంది....

    Accident : ప్రమాదం నుంచి బయట పడ్డ ఈ హీరో ఇప్పుడు సక్సెస్ బాటలో..

    Accident : ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో మృత్యువు అంచుల...

    Mega Hero : మెగా ఇంట మళ్లీ పెళ్లి బాజాలు..! ఆ హీరోయిన్‌తో హీరో పెళ్లి ఫిక్స్..?

    Mega Hero :మెగా ఇంట్లో మరోసారి పెళ్లి భాజాలు మోగనున్నాయా? అంటే...