Debina Banerjee మన తెలుగు సినిమాల్లో చాలా మంది హీరోయిన్లు వస్తుంటారు పోతుంటారు. ఒక్కో హీరోయిన్ ఒకే సినిమాలోనే నటించి తరువాత తెరమరుగు అవుతున్నారు. గ్లామర్, టాలెంట్ ఉన్నా ఆఫర్లు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. పెళ్లి చేసుకుని చాలా మంది సినిమాలకు దూరమయ్యారు. అందం, నటన ఉన్నా అవకాశాలు రాకపోవడంతో సినిమాలకు దూరంగా ఉండే వారు చాలా మంది ఉండటం గమనార్హం. డెబీనా బెనర్జీ కూడా తెలుగులో నటించింది.
పశ్చిమ బెంగాల్ లోని కలకత్తా కు చెందిన డెబీనా బెనర్జీ తన 20వ ఏట 2003లో ఇండియన్ బాబు అనే హిందీ సినిమాలో ఓ క్యారెక్టర్ లో నటించింది. అదే ఏడాది రవిబాబు అమ్మాయిలు అబ్బాయిలు సినిమాలో చాన్స్ వచ్చింది. మొదటి సినిమాతోనే గుర్తింపు తెచ్చుకుంది. కన్నడలో రాజ్ కుమార్ పక్కన నటించింది. తమిళంలో విజయ్ కాంత్ తో జోడీ కట్టింది.
మొదటి సినిమా చేసిన పదేళ్లకు 2013లో జగపతి బాబు నటించిన సిక్స్ సినిమాలో కనిపించింది. తమిళ, హిందీ టీవీ సీరియల్స్ లో నటించిది. 2011లో యాక్టర్ గుర్మీత్ చౌదరిని వివాహం చేసుకుంది. 2021లో పది సంవత్సరాల తరువాత ఈ జంట మరోమారు పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం హిందీలో వస్తున్న ఆఫర్లను వినియోగించుకుంది. డెబీనా బెనర్జీ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి.
ప్రస్తుతం సినిమాలకు టాటా చెప్పి పెళ్లి చేసుకుని సంసారం చేసుకుంటోంది. ఎన్నో సినిమాల్లో నటించినా రాని పేరు ఒక్క సినిమాతోనే సంపాదించుకుంది. తను నటించిన అమ్మాయిలు అబ్బాయిలు సినిమాతో ఎంతో పేరు సంపాదించుకుంది. తరువాత కాలంలో సినిమాలకు దూరమైంది. ఇప్పుడు పిల్లలతో సరదాగా గడుపుతోంది. తెలుగు హీరోయిన్ కాకపోయినా తెలుగువారి గుండెల్లో చిరస్థానం సంపాదించుకుంది.