
ఆర్ ఆర్ ఆర్ నాటు నాటు సాంగ్ ఆస్కార్ సాధించింది. దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి, హీరోలు జూనియర్ ఎన్టీఆర్ , రాంచరణ్ , సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి , పాటల రచయిత చంద్రబోస్ , గాయకులు కాలభైరవ , రాహుల్ సిప్లిగంజ్, డ్యాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ , సెకండ్ యూనిట్ డైరెక్టర్ ఎస్ ఎస్ కార్తికేయ, రాజమౌళి కుటుంబం మొత్తం ఇలా అందరూ ఆస్కార్ వేదిక వద్ద కనిపించారు……. సందడి చేశారు. అయితే ఆర్ ఆర్ ఆర్ సినిమాను నిర్మించిన డివివి దానయ్య మాత్రం ఎక్కడా కనిపించలేదు. దానయ్య భారత్ లోనే ఉండిపోయాడు.
పోనీ ఇక్కడే ఉన్నాడు కదా…… అలాగైనా సరే మీడియాలో నానుతున్నాడా ? అంటే అదీ లేదు. పాపం …… దానయ్యను పట్టించుకున్న వాళ్లే లేకుండాపోయారు. దారిన పోయే దానయ్య లాగా మారింది పాపం అతడి పరిస్థితి. ఇంతటి భారీ బడ్జెట్ పెట్టి నిర్మించిన దానయ్యకు సరైన గౌరవం దక్కడం లేదు. దర్శకుడు, హీరోలు , ఇతర సాంకేతిక నిపుణులకు గౌరవం లభిస్తోంది కానీ దానయ్యను మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు.
ఆర్ ఆర్ ఆర్ సినిమా మేకింగ్ సమయంలో అలాగే రిలీజ్ అయ్యే సమయంలో ప్రమోషన్స్ లో కూడా దానయ్య కు స్థానం దక్కలేదు పాపం. అయితే ఆ సినిమా నిర్మాత అనే హోదా దక్కింది కదా …… అది చాలు….. అయినా నేను ముందు ఉండాలని కోరుకునే వాడ్ని కాదు…… అంతా వెనకాల వుండే చూసుకుంటాను అని అంటున్నాడు నిర్మాత డివివి దానయ్య.