
who this star hero : బాలీవుడ్ ఇండస్ట్రీకి ధీటుగా ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీ కూడా ఎదిగిన విషయం తెలిసిందే.. చెప్పాలంటే నార్త్ కంటే కూడా సౌత్ ఇంకా పైచేయి సాధించింది.. గత రెండు మూడేళ్ళలో నార్త్ హీరోలు కంటే సౌత్ హీరోలు గ్లోబల్ వైడ్ గా ఫేమస్ అవుతున్నారు.. హాలీవుడ్ సినిమాల్లో కూడా అవకాశం అందుకుంటూ అక్కడ కూడా రాణించడానికి ప్రయత్నాలు మొదలెట్టారు.
మనం ఇప్పుడు చెప్పుకోబోయే స్టార్ హీరో కేసుల తెలుగు, తమిళ్ భాషల్లో తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ ను ఏర్పరుచుకున్నారు.. ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉండి విభిన్న సినిమాలలో నటిస్తూ స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.. ఇటీవల ఆయన చైల్డ్ హుడ్ పిక్ ఒకటి నెట్టింట వైరల్ అయ్యింది..
మరి ఆ స్టార్ హీరో ఎవరు? అనేది ఇప్పుడు ఆడియెన్స్ ఆసిక్తిగా చూస్తున్నారు. మే 25న ఆయన బర్త్ డే సందర్భంగా దీనిని ఆయన అభిమానులు బయటపెట్టి విషెష్ చెబుతున్నారు. ఆ హీరో ఎవరో కాదు కార్తీ.. 2007లో సినీ ఇండస్ట్రీలోకి సూర్య తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చాడు.. మొదటి సినిమా తోనే ఫిలిం ఫేర్ అందుకుని ఆకట్టుకున్నాడు.
ఇక ఆ తర్వాత ఈయన అదే సినిమాతో ను యుగానికి ఒక్కడు పేరుతో డబ్బింగ్ చేసి తెలుగులోకి పరిచయం అయ్యాడు. అప్పటి నుండి ఇక్కడ అక్కడ రెండు చోట్ల ఫేమస్ అయ్యాడు. వరుసగా సినిమాలు చేస్తూ డిఫరెంట్ పాత్రలను పోషిస్తూ ఆడియెన్స్ ను అలరిస్తున్నాడు. ప్రజెంట్ జపాన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా డిఫరెంట్ గా ఉండబోతుంది.. ఇక ఈ రోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా సౌత్ ప్రేక్షకులు భారీగా శుభాకాంక్షలు చెబుతూ నెట్టింట సందడి చేస్తున్నారు. మరి మీరు కూడా చెప్పేయండి..