అక్కినేని అఖిల్ హీరోగా తాజాగా నటిస్తున్న చిత్రం ” ఏజెంట్ ” . సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమా బడ్జెట్ ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయ్యింది. ఇంతకీ ఈ సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా…… 80 కోట్లకు పైమాటే. ఈరోజుల్లో 80 కోట్ల బడ్జెట్ పెద్ద మ్యాటర్ కాదు కానీ హీరో అఖిల్ కావడమే చర్చకు దారి తీసింది.
అసలు విషయం ఏమిటంటే……. అఖిల్ హీరోగా ఇప్పటికి పలు చిత్రాల్లో నటించాడు కానీ ఇప్పటి వరకు సాలిడ్ గా ఒక్క హిట్టు కూడా కొట్టలేదు. గుడ్డిలో మెల్ల ఏంటంటే ……. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ అనే సినిమా మాత్రమే కాస్త ఆడింది. మిగతా సినిమాలు ప్లాప్ అయ్యాయి. దాంతో అలాంటి హీరో పైన 80 కోట్ల బడ్జెట్ అంటే చాలా చాలా రిస్క్ అనే చెప్పాలి. అందుకే ఏజెంట్ మూవీ బడ్జెట్ టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది.
ఈ సినిమా బడ్జెట్ భారీగా పెరగడంతో హీరో అఖిల్ , దర్శకుడు సురేందర్ రెడ్డి తమ రెమ్యునరేషన్ లను త్యాగం చేశారట. ఇక సినిమా విడుదలై మంచి విజయం సాధించాక , లాభాలు వచ్చాక అప్పుడు రెమ్యునరేషన్ తీసుకుంటామని చెప్పారట నిర్మాతకు. ఈ మాటలకు నిర్మాత కూడా ఓకే అన్నాడట. మస్కట్ లో ఓ భారీ యాక్షన్ సీన్ కోసం ఏజెంట్ చిత్ర యూనిట్ వెళ్లనుందట. ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇది అఖిల్ కు పాన్ ఇండియా చిత్రం కావడం విశేషం. ఏజెంట్ చిత్రాన్ని ఏప్రిల్ 28 న భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.