
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా పుష్ప 2 చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇదే సమయంలో షారుఖ్ ఖాన్ – నయనతార జంటగా నటిస్తున్న జవాన్ చిత్రంలో గెస్ట్ రోల్ చేయాలంటూ దర్శకుడు అట్లీ ఓ ప్రతిపాదన తీసుకొచ్చాడట. అయితే ఈ ప్రతిపాదనకు అల్లు అర్జున్ ఒప్పుకుంటాడా ? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న గా మారింది. స్పెషల్ రోల్ పవర్ ఫుల్ గా ఉంటే తప్పకుండా ప్రయోజనం ఉంటుంది. అలా కాకుండా పెద్దగా ఇంపార్టెన్స్ లేని పాత్ర అయితే చేసి ఉపయోగం లేదు. కానీ అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ కాబట్టి తప్పకుండా కీలక పాత్రే అయి ఉంటుంది.
కానీ ఇలాంటి పాత్రలు అల్లు అర్జున్ ఒప్పుకుంటాడా ? అన్నది ఆసక్తికరంగా మారింది. తాజాగా షారుఖ్ ఖాన్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో జవాన్ అనే సినిమాలో నటిస్తున్నాడు. నయనతార ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ అయ్యింది. దాంతో జవాన్ లో అల్లు అర్జున్ కూడా ఉంటే బాగుండు అని దర్శకుడు అట్లీ భావించాడట. అల్లు అర్జున్ ను సంప్రదించారు. మరి దీనికి అల్లు అర్జున్ ఒప్పుకుంటాడా ? అన్నది చూడాలి.
అల్లు అర్జున్ తాజాగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 చిత్రం చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ వైజాగ్ లో షెడ్యూల్ జరుపుకుంది. వైజాగ్ షెడ్యూల్ పూర్తి చేసుకొని హైదరాబాద్ చేరుకున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ దృష్టి అంతా పుష్ప 2 మీదే ఉంది.