అగ్ర నిర్మాత దిల్ రాజు సంస్థ నిర్మించిన చిత్రం ” బలగం ”. కమెడియన్ వేణు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. హాస్య నటుడిగా పలు చిత్రాల్లో నటించిన వేణు జబర్దస్త్ తో మరింతగా పాపులర్ అయ్యాడు. జబర్దస్త్ మానేసి మరో ఛానల్ లో అదే కామెడీ షో చేయడానికి వెళ్ళాడు అయితే అది అట్టర్ ప్లాప్ అయ్యింది. దాంతో ఇలా మెగా ఫోన్ చేతబట్టాడు.
దిల్ రాజుకు కథ చెప్పి ఒప్పించడం అంటే మాటలు కాదు ఆ పని చేసి విజయం సాధించాడు వేణు. షూటింగ్ అంతా అయిపోయింది. ఇక మార్చి 3 న విడుదలకు సిద్ధమైంది బలగం చిత్రం. నిన్న రాత్రి ట్రైలర్ విడుదల చేసారు. మానవ సంబంధాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందినట్లు తెలుస్తోంది. డబ్బుకు కాదు మనిషికి , మానవత్వానికి విలువ ఇవ్వాలి అనే కథాంశంతో ఈ సినిమా రూపొందింది.
ప్రేక్షకులను ఎంగేజ్ చేయగలిగేలా ఉంటే తప్పకుండా హిట్ అవుతుంది. అయితే ప్రేక్షకులను రెండు గంటల పాటు ఎంగేజ్ చేయగలిగేలా రూపొందిందా ? అన్నదే మార్చి 3 న తేలనుంది. కమెడియన్ ప్రియదర్శి హీరోగా నటించగా కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా నటించింది. దిల్ రాజు ప్రొడక్షన్ కాబట్టి మంచి థియేటర్ లలోనే విడుదల అవుతుంది. ప్రేక్షకులను మెప్పించగలిగితే సూపర్ హిట్ దక్కినట్లే !.