
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ తెలుగులో అఖండ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. బాలయ్య కు 100 కోట్ల సినిమా లేకుండాపోయింది. అలాంటి సమయంలో వచ్చిన అఖండ ఏకంగా 150 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి చరిత్ర సృష్టించింది. హిందుత్వం మీద వచ్చిన ఈ సినిమా లో బాలయ్య నటన శిఖరాగ్రం అనే చెప్పాలి. ఇక బాలయ్య నటనకు తోడు తమన్ అందించిన నేపథ్య సంగీతం కూడా ఈ సినిమాను మరో లెవల్ లో నిలబెట్టింది.
తెలుగులో ప్రభంజనం సృష్టించిన అఖండ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయాలని అగ్ర నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ హక్కులు తీసుకుంది. అయితే బాలయ్య లా నటించడం , ఆ మ్యాజిక్ ను క్రియేట్ చేయడం ఏ హీరోకు సాధ్యం కాదని భావించి రీమేక్ చేయకుండా డబ్బింగ్ చేయించారు. జనవరి 20 న అఖండ హిందీ డబ్బింగ్ చిత్రం విడుదల అవుతోంది.
హై ఓల్టేజ్ యాక్షన్ చిత్రంగా రూపొందిన ఈ చిత్రం హిందీలో 100 కోట్లకు పైగా సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారట. ఎందుకంటే ఇటీవల కాలంలో పలు తెలుగు చిత్రాలు హిందీలో అవలీలగా 100 కోట్ల వసూళ్లను సాధించాయి. దాంతో అదే మ్యాజిక్ అఖండ కూడా చేస్తుందని నమ్ముతున్నారట. అదే కనుక నిజమైతే బాలయ్య జోరు హిందీలో కూడా మొదలు కానుంది. బాలయ్య ద్విపాత్రాభినయం పోషించిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది. తమన్ అందించిన నేపథ్య సంగీతం ఈ సినిమాకు హైలెట్ అనే చెప్పాలి.