
మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొణిదెల నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. ఇంతకుముందు వెబ్ సిరీస్ నిర్మించింది కూడా. అయితే ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. కట్ చేస్తే ఇప్పుడు శ్రీదేవి – శోభన్ బాబు అనే టైటిల్ తో సినిమా నిర్మించింది. ఈ చిత్రంలో హీరోగా సంతోష్ శోభన్ నటించాడు. ఈ సినిమా మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 18 న విడుదల అవుతోంది.
అయితే ఈ సినిమా మీద సుస్మిత చాలా ఆశలు పెట్టుకుంది. నిర్మాతగా తప్పకుండా హిట్ కొడతామనే ధీమా వ్యక్తం చేస్తోంది. శ్రీదేవి – శోభన్ బాబు ప్రేక్షకులకు నచ్చుతుందని, సగటు ప్రేక్షకుల కు తరచుగా ఎదురయ్యే సంఘటనలతోనే ఈ సినిమా చేశామని అంటోంది. అయితే శ్రీదేవి – శోభన్ బాబు సినిమా పై పెద్దగా అంచనాలు లేవు. దానికి తోడు మెగాస్టార్ చిరంజీవి లాంటి వాళ్ళు కాస్త ప్రచారం చేస్తే తప్పకుండా ప్రయోజనం ఉంటుంది. కానీ ఆ పని మెగా హీరోలు ఎవరూ చేయలేదు. ఇలాంటి సమయంలో సుస్మిత నిర్మించిన ఈ సినిమా కనుక విజయం సాధిస్తే తప్పకుండా సుస్మిత విజయం అని భావించాల్సి వస్తుంది. అలాగే మంచి అభిరుచి ఉన్న నిర్మాతగా పేరు కూడా వస్తుంది. ధైర్యే సాహసే లక్ష్మీ అన్నట్లుగా ముందడుగు వేసింది. దాంతో సుస్మిత ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు పలువురు. అంతేకాదు మెగా బ్రదర్ నాగబాబు కూడా సుస్మిత పై ప్రశంసలు కురిపించాడు.