
నాని హీరోగా నటించిన చిత్రం దసరా. నానికి ఇది మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం కావడం విశేషం. ఇప్పటికే విడుదలైన నాని ఫస్ట్ లుక్ , టీజర్ , సాంగ్ , ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు నెలకొనేలా చేసాయి. దాంతో ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ఈనెల 30 న భారీ ఎత్తున తెలుగు , తమిళ , మలయాళ , కన్నడ , హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల అవుతోంది.
దసరా చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్న సమయంలో ఓ సెంటిమెంట్ మాత్రం నాని అభిమానులను తీవ్రంగా భయపెడుతోంది. ఇంతకీ ఆ సెంటిమెంట్ ఏంటో తెలుసా……… ఈ చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్.
అవును శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ ఈ దసరా చిత్రాన్ని నిర్మించాడు. ఇప్పటి వరకు చెరుకూరి సుధాకర్ నిర్మించిన చిత్రాలన్నీ ఘోర పరాజయం పాలయ్యాయి. ఒక్క సినిమా కూడా విజయం సాధించలేకపోయింది. దాంతో ఆ సెంటిమెంట్ ఇప్పుడు కూడా రిపీట్ అయితే ఎలా ? అనే భయం నెలకొంది అభిమానులలో. Sharwanand హీరోగా నటించిన పడిపడి లేచే మనసు , ఆడవాళ్లు మీకు జోహార్లు , Rana – Sai Pallavi జంటగా నటించిన విరాట పర్వం , Ravi teja హీరోగా నటించిన రామారావు ఆన్ డ్యూటీ , Sundeep హీరోగా నటించిన రన్ తదితర చిత్రాలను నిర్మించాడు చెరుకూరి సుధాకర్. అయితే ఆ సినిమాలన్నీ అట్టర్ ప్లాప్ అయ్యాయి. దాంతో దసరా సినిమాతో నాని ఆ సెంటిమెంట్ ను బద్దలు కొడతాడా ? లేదా ? అనే టెన్షన్ లో ఉన్నారు. దసరా సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దాంతో అభిమానులు భయపడుతున్నారు. సెంటిమెంట్ రిపీట్ అవుతుందా ? బ్రేక్ అవుతుందా ? అన్నది ఈనెల 30 న తేలనుంది. అప్పటి వరకు ఎదురు చూడటమే…… దసరా రిజెల్ట్ కోసం.