స్టార్ హీరోయిన్ సమంత మళ్లీ పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పైగా ఈ వార్తలను నమ్మడానికి సద్గురు ను కూడా లైన్ లోకి తెచ్చారు. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, వ్యక్తిత్వ వికాస నిపుణులు సద్గురు ఉపదేశాలు సమంత ను బాగా ప్రభావితం చేసాయి. నాగచైతన్య తో విడాకుల ముందు పెద్దగా సద్గురు ఆశ్రమానికి వెళ్ళేది కాదు కానీ విడాకులు తీసుకున్న తర్వాత మాత్రం తరచుగా సద్గురు ఆశ్రమానికి వెళ్ళేది.
దాంతో సమంత మనసు ప్రశాంతంగా ఉండేదట. అందుకే మళ్లీ మళ్లీ ఆశ్రమానికి వెళ్లడంతో సద్గురు మళ్లీ పెళ్లి చేసుకొని హాయిగా ప్రశాంతమైన జీవితాన్ని గడపమని చెప్పాడట. అంతేకాదు తనకు తెలిసిన వాళ్లలో మంచి సంబంధాన్ని కూడా చేశాడని రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అంతేకాదు సమంత చర్మ సంబంధించిన సమస్యతో బాధపడుతోందని, అందుకే ఆ చికిత్స కోసం అమెరికా వెళ్లిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే సమంత ఇప్పట్లో రెండో పెళ్లి చేసుకోవడం అంటే కాస్త నమ్మశక్యంగా లేదనే చెప్పాలి. అయితే చర్మ సంబంధిత సమస్యతో మాత్రం బాధపడుతోంది …… ఇది వాస్తవం. గతంలో కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసింది.