
మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత నిర్మాతగా మారి వెబ్ సిరీస్ లను అలాగే సినిమాలను నిర్మిస్తోంది. ఇప్పటి వరకు సుస్మిత నిర్మించిన వెబ్ సిరీస్ లు పెద్దగా విజయం సాధించలేదు. ఇక నిర్మాతగా సినిమా కూడా నిర్మించింది. ఆమధ్య చేసిన ఒక సినిమా ప్లాప్ అయ్యింది. ఇక ఇప్పుడేమో శోభన్ బాబు -శ్రీదేవి అనే సినిమా చేసింది.
ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. దివంగత దర్శకుడు శోభన్ కుమారుడు సంతోష్ శోభన్ హీరోగా నటించాడు ఈ చిత్రంలో. సంతోష్ శోభన్ కూడా హీరోగా పలు చిత్రాల్లో నటించాడు కానీ ఇంతవరకు కమర్షియల్ హిట్ కొట్టలేకపోయాడు. థియేటర్ లలో రిలీజ్ చేస్తున్నారు కానీ అక్కడ పెద్దగా ఆదరణ లభించడం లేదు. దాంతో కొన్ని చిత్రాలను నేరుగా ఓటీటీ లోనే విడుదల చేశారు. అయినా ఫలితం శూన్యం . కాకపోతే ఏక్ మినీ కథ మాత్రం కాస్త మెప్పించింది ఓటీటీలో.
ఇక సుస్మిత విషయానికి వస్తే ……. మెగాస్టార్ చిరంజీవి కూతురుగా ఫ్యాషన్ డిజైనర్ గా సత్తా చాటింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన పలు చిత్రాలకు ఫ్యాషన్ డిజైనర్ గా వ్యవహరించింది. ఇక తనకంటూ ప్రత్యేకత ఉండాలని నిర్మాతగా మారింది. వెబ్ సిరీస్ లను , చిత్రాలను నిర్మిస్తోంది కానీ ఇప్పటి వరకు విజయం వరించలేదు. మరి ఈ శోభన్ బాబు – శ్రీదేవి చిత్రంతో నైనా విజయం సాధిస్తుందా ? చూడాలి.