మహిళాలోకం గొప్పతనాన్ని ఆవిష్కరించిన అరుదైన అద్భుతమైన పాట ” మానవజాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ ”. ఈ పాటను డాక్టర్ సి. నారాయణ రెడ్డి రచించారు. మహానటి సావిత్రి దర్శకత్వం వహించిన ఈ సినిమా పేరు ” మాతృదేవత ”. 1969 లో విడుదలైన ఈ చిత్రం మంటగలిసి పోతున్న మానవ సంబంధాలను మరోసారి తట్టిలేపింది.
మాతృదేవత చిత్రంలో మహా నటుడు నందమూరి తారకరామారావు హీరోగా నటించగా కీలక పాత్రలలో సావిత్రి , నటభూషణ్ శోభన్ బాబు , రేలంగి , చంద్రకళ , రాజబాబు , హేమలత , ప్రభాకర్ రెడ్డి , నాగభూషణం , సాక్షి రంగారావు , జగ్గారావు తదితరులు నటించారు. దిగ్గజ నటీనటులు నటించిన ఈ చిత్రానికి సావిత్రి దర్శకత్వం వహించడం విశేషం.
ఇక ఈ సినిమాలో మహిళల గొప్పతనాన్ని చాటి చెప్పాలని భావించిన సావిత్రి డాక్టర్ సి. నారాయణ రెడ్డికి కథా వస్తువు వివరించగా అద్భుతమైన పాటను అందించారు. ఆణిముత్యాల్లాంటి పదాలను అల్లిన సినారేకు కెవి మహదేవన్ లాంటి ఉద్దండుడు తోడవ్వడంతో అద్భుతమైన సంగీతం అందించాడు. ఇంకేముంది ఆ పాట ఇప్పటికీ మారుమ్రోగుతూనే ఉంది.ఓ మహిళ పురుషుడి జీవితంలో రకరకాల పాత్రలను పోషించేలా సినారే చెప్పిన విధానం బహుముచ్చటగా ఉంది. తల్లిగా , చెల్లిగా , భార్యగా , వీర వనితగా , పలు రకాలుగా మహిళలోని భిన్న పార్శ్వాలను స్పృశించారు ఈ పాటలో. ఈ పాటను మరోసారి ఆలకించండి …… మహిళల గొప్పతనాన్ని తెలుసుకోండి. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కావడంతో ఆ సందర్బంగా మహిళా లోకానికి శుభాకాంక్షలు అందజేస్తోంది jaiswarajya.tv.