
సుహాస్ హీరోగా నటించిన సంచలన చిత్రం writer పద్మభూషణ్. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సూపర్ హిట్ అయ్యింది. 6 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 7 కోట్ల 29 లక్షల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఓవర్సీస్ లో సైతం ఈ సినిమా మంచి వసూళ్లను సాధించడం విశేషం.
సుహాస్ నటనకు స్టార్ హీరోలు , స్టార్ డైరెక్టర్ లు కూడా ఫిదా అవుతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు writer పద్మభూషణ్ టీమ్ ను తన దగ్గరకు పిలిపించుకుని మరీ అభినందించాడు. అంతకంటే ముందు మహేష్ బాబు ఈ సినిమాను చూడటం విశేషం. అలాగే ఇతర సినీ ప్రముఖులు కూడా writer పద్మభూషణ్ చిత్రాన్ని కొనియాడారు. చిన్న చిత్రంగా వచ్చి పెద్ద విజయమే సాధించింది. ఇక సుహాస్ కు మరో బ్లాక్ బస్టర్ చేతిలో పడింది. దాంతో మరింత డిమాండ్ పెరగడం ఖాయం ఈ హీరోకు. అయితే హీరోగా ఎన్ని విజయాలు సాధించినా….. అన్ని రకాల పాత్రలను చేస్తానని అంటున్నాడు.