
KGF చిత్రాల్లో రాఖీభాయ్ గా అదరగొట్టిన హీరో యష్. అతడు లేకుండా KGF చిత్రాన్ని ఊహించుకోవడం కష్టం అంతగా ముద్ర వేసాడు. KGF సిరీస్ లో వచ్చిన రెండు చిత్రాలు కూడా బ్లాక్ బస్టర్ అయ్యాయి. వసూళ్ల వర్షం కురిపించాయి. హోంబలే సంస్థను అగ్రపథాన నిలబెట్టాయి. ఇక ఆ చిత్రాల నిర్మాత విజయ్ కిరగందూర్ తాజాగా మీడియా ముందుకు వచ్చి బాంబ్ పేల్చాడు.
KGF 3 చిత్రాన్ని 2025 లోనే పట్టాలెక్కిస్తాం …… అయితే ఇకపై హీరోగా యష్ ఉండడు అతడి స్థానంలో మరో హీరో ఉంటాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. బాలీవుడ్ లో పలు చిత్రాలు ఇదే ఫాలో అవుతున్నాయి. అందుకే అదే దారిలో మేము కూడా వెళ్లాలని అనుకుంటున్నాం అంటూ బాంబ్ పేల్చాడు. విజయ్ మాటలు యష్ అభిమానులను తీవ్రంగా కలిచి వేయడం ఖాయం. అంతేకాదు ఆ నిర్మాతను ట్రోల్ చేయడం కూడా ఖాయం.
KGF వంటి సంచలన చిత్రాలను నిర్మించిన విజయ్ కిరగందూర్ ఇటీవలే కాంతార వంటి చిన్న బడ్జెట్ సినిమా చేసారు. ఆ సినిమా కూడా సరికొత్త చరిత్ర సృష్టించింది. కాంతార ఏకంగా 400 కోట్లకు పైగా వసూళ్లను సాధించి చరిత్ర సృష్టించింది. చిన్న చిత్రంగా వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా చిత్రంగా దుమ్ము దులిపేసింది.