
VD 12 Vs Sikinder: బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నటించిన డున్కీ పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ క్లాష్ బాక్సాఫీస్ వద్ద మనం చూసిన అత్యంత తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ ఘర్షణ ప్రభావం కేవలం ట్విట్టర్, యూట్యూబ్ మొదలైన వాటికే పరిమితం కాకుండా గ్రౌండ్ లెవల్, ఇండస్ట్రీ స్థాయికి కూడా చేరింది.షారుక్ నటించిన డున్కీ హిందీ మార్కెట్లో బాగా ఆడగా.. ప్రభాస్ నటించిన సలార్ ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ కలెక్షన్లు రాబట్టింది.
ఇప్పుడు ఆ పోటీ సల్మాన్ ఖాన్, విజయ్ దేవరకొండ మధ్య జరగబోతోంది. విజయ్ దేవరకొండ సినిమా VD 12 2025, మార్చి 28న రిలీజ్ చేయనున్నారు. అందు కోసం మేకర్స్ వేగంగా పని చేస్తున్నారు. ఇప్పటికే 60 శాతం చిత్రీకరణ పూర్తి చేశారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ నెల లాస్ట్ లో టైటిల్ అనౌన్స్‌మెంట్ రానుంది.
సల్మాన్ ఖాన్ ఈద్ కోసం సికిందర్ ను సిద్ధం చేస్తున్నాడు. మార్చి 30న విడుదల కానుండగా, వీడీ 12తో పోటీ పడనుంది. అధికారికంగా కన్ఫర్మ్ కానప్పటికీ వీడీ 12ను పాన్ ఇండియా మూవీగా హిందీలో కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఎనిమిదేళ్లుగా ఒక్క హిట్ సినిమా కూడా ఇవ్వని సల్మాన్ తన మురుగదాస్ దర్శకత్వంలో వస్తున్న సికిందర్ పై భారీగా అంచనాలు పెట్టుకున్నాడు.
బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ ఈద్ రిలీజ్ లు పెద్ద గొడవలు లేకుండా ఫ్రీ రన్ ను ఎంజాయ్ చేస్తాయిజ ఇది అతని సినిమాలు విజయం సాధించడానికి మంచి అవకాశాన్ని ఇస్తుంది. 2025, మార్చి 28న విడుదల కానున్న విజయ్ దేవరకొండ వీడీ12, మార్చి 30న విడుదల కానున్న సల్మాన్ సికిందర్ తో నెక్ టు నెక్ పోటీ పడుతుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ గొడవ భీకరంగా ఉంటుందని, ఇద్దరు నటుల అభిమానులు తీవ్ర వాగ్వాదానికి దిగే అవకాశం ఉందని అంటున్నారు. ఈ ఘర్షణ డంకీ వర్సెస్ సలార్ యుద్ధం వలె తీవ్రంగా, వికృతంగా ఉంటుందో లేదో చూడాలి.