
అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన చిత్రం కస్టడీ. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్ర టీజర్ కొద్దిసేపటి క్రితం విడుదల చేసారు మేకర్స్. ఈ టీజర్ పవర్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ గా ఉంది. యాక్షన్ హీరోగా నాగచైతన్య సత్తా చాటాలని చాలాకాలంగా ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ పాపం యాక్షన్ చిత్రాలు చైతూ కు కలిసి రావడంలేదు.
అయితే విజయాల సంగతి ఎలా ఉన్నప్పటికీ ……. కస్టడీ టీజర్ మాత్రం అదిరింది. ఒకప్పటి హీరో అరవింద్ స్వామి ఈ చిత్రంలో విలన్ గా నటించాడు. అలాగే శరత్ కుమార్ కూడా కీలక పాత్రలో నటించాడు. ఇక హీరోయిన్ గా అందాల భామ కృతి శెట్టి నటించింది. మేలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. తెలుగు , తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది.