Home NRI TELUGU ASSOCIATION OF METRO ATLANTA:తామా ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు

TELUGU ASSOCIATION OF METRO ATLANTA:తామా ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు

37
atlanta bathukamma celebrations
atlanta bathukamma celebrations
atlanta bathukamma celebrations
atlanta bathukamma celebrations

అమెరికాలోని చారిత్రాత్మక నగరమైన అట్లాంటాలో కూడా పెద్ద ఎత్తున తెలుగువాళ్లు ఉంటున్న విషయం తెలిసిందే. అక్కడి తెలుగువాళ్లంతా కలిసి ఏర్పాటు చేసుకున్న సంస్థ ” Telugu Association of Metro Atlanta ” ( తామా ). తాజాగా తామా ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అలాగే దసరా ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు.

చిన్నారులు , పెద్దలు , మహిళలు మొత్తంగా 1200 మందికి పైగా ఈ వేడుకలలో పాల్గొన్నారు. చిన్నారులు , మహిళలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఖండాంతరాలను దాటినప్పటికీ బతుకమ్మ వేడుకలను మాత్రం అంగరంగ వైభవంగా నిర్వహిస్తూనే ఉన్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ సందడి చేసారు. తామా ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. సునీత పొట్నూరు , రవి కల్లి , శ్రీరామ్ రొయ్యల , సాహిత్య వింజమూరి , శ్రీవల్లి శ్రీధర్ , తదితరులతో పాటుగా వందలాది మంది ఈ వేడుకలలో పాల్గొన్నారు.