Home EXCLUSIVE Wearing Bra Tips : బ్రా ఎక్కువ గంటలు ధరిస్తే ఏమవుతుందో తెలుసా?

Wearing Bra Tips : బ్రా ఎక్కువ గంటలు ధరిస్తే ఏమవుతుందో తెలుసా?

15
Wearing Bra Tips
Wearing Bra Tips

Wearing Bra Tips : మహిళల డ్రెస్సింగ్ స్టయిల్ లో బ్రా కూడా ఒకటి. వక్షోజాలు సరైన ఆకృతిలో ఉండేందుకు, కొందరు కంఫర్ట్ గా ఉండేందుకు వీటిని ఉపయోగిస్తారు. అయితే ఇది కూడా కొంత టైం వరకే వాడాలట. ఈ విషయంపై చాలా మందిలో చాలా డౌట్లు ఉంటాయి. బ్రా రోజులో ఎక్కవ సేపు రోజూ వేసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందని, నలుపు రంగు బ్రా వాడకూడదని ఇంకొందరు, కాదు కాదు తెలుపు వాడద్దని మరికొందరు.. ఇలా ఎవరికి నచ్చిన అభిప్రాయాలు వారు వ్యక్తం చేస్తారు.

కానీ ఆరోగ్య నిపుణులు ఏం చేప్తున్నారు? ఎలా వాడాలంటున్నారు. వాడకం వల్ల ఉపయోగం ఎక్కువనా లేదంటే దుష్ప్రభావాలు ఎక్కువనా? అన్న అనుమానాలు అప్పుడప్పుడు కలుగుతున్నాయి. బ్రా వేసుకున్న వారు కంఫర్ట్‌గా, కాన్ఫిడెంట్‌గా ఉంటారు. కానీ దీని వలన లాభాలు కాకుండా నష్టాలు కూడా ఉన్నాయంట. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఎక్కవ సేపు బ్రా ధరించడం వల్ల కొన్ని రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. కొందరు రోజు మొత్తం బ్రా వేసుకుంటారు ఇది సరైన పద్ధతి కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. రెగ్యూలర్‌గా, ఎక్కువ సేపు వేసుకోవడం వల్ల ఆడవారికి ఎక్కువగా భుజం, మెడనొప్పి, బరువు ఎక్కువగా మోస్తున్నట్లు ఇబ్బందిగా ఉంటుందట. వక్షోజాల చుట్టూ ధూళి, చెమట చేరి మొటిమలు వ్యాపించే అవకాశం ఉందట. అందుకే రోజులో 8 గంటలు మాత్రమే వాడాలట. దీని వలన రక్త ప్రసరణ బాగా ఉంటుందని చెప్తున్నారు. మహిళలు చీరలు, డ్రెస్ ల కంటే బ్రాలను ఎంచుకునేందుకే ఎక్కువ సమయం కేటాయించాట. బ్రాండెడ్ కంపెనీ, తేమను ఎక్కువగా తీసుకునేది, గాలి ఫ్రీగా ఆడేది ఎంచుకోవాలి, లేదంటే ఇబ్బందులు తప్పవు అంటున్నారు నిపుణులు.