Home EXCLUSIVE Janasena : తెలంగాణలో పోటీపై జనసేన ఏం ఆలోచిస్తోంది?

Janasena : తెలంగాణలో పోటీపై జనసేన ఏం ఆలోచిస్తోంది?

9

Janasena : తెలంగాణలో పవన్ కల్యాణ్ కు ఫాలోయింగ్ ఎక్కువే. ఆయన ఎక్కడికి వెళ్లినా అభిమానులు బ్రహ్మరథం పడతారు. ఏ నటుడికి లేనంతా ఫ్యాన్స్ పవన్ కు ఉండడం మనకు తెలిసిందే. దీంతో తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందా? పోటీ చేసి నిలుస్తుందా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. రాష్ట్రంలో జనసేన పోటీ చేస్తే కనీసం డిపాజిట్ దక్కుతుందా అని అంటున్నారు. ఈనేపథ్యంలో జనసేన ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిందే.

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి పోటీ చేసేందుకు రెడీగా ఉన్నారా? పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచే సత్తా ఉన్న వారు జనసేనలో ఉన్నారా అని అడుగుతున్నారు. ఎన్నికల సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి ఒక్క స్థానంలో అయినా అభ్యర్థిని ప్రకటించాలని చూస్తోంది. దీంతో జనసేన ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

బీజేపీతో పొత్తు ఉన్న నేపథ్యంలో వారికి మద్దతు ఇస్తుందా? లేక ఒంటరిగా పోటీలో ఉంటుందా అనేదానిపై స్పష్టత లేదు. దీనిపై పవన్ కల్యాణ్ కూడా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందా? లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలి ఉంది. కొన్ని సీట్లలో పోటీలో ఉంటే ఎలా ఉంటుందనే కోణంలో ఆలోచిస్తున్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ 8 చోట్ల పోటీ చేసినా డిపాజిట్లు కూడా దక్కలేదు. దీంతో జనసేన ఒంటరిగా పోటీ చేసేందుకు మొగ్గు చూపదని తెలుస్తోంది. ఈ క్రమంలో జనసేన రాష్ట్రంలో పోటీకి ముందుకు రాదని అంటున్నారు. ఏపీలోనే తన బలం చూపించుకోవాలని తాపత్రయపడుతోంది. దీని కోసమే సర్వశక్తులు ఒడ్డి పోరాడుతోంది.

ఇప్పుడు జనసేన ఏపీలో చక్రం తిప్పి అధికారం చేజిక్కించుకోవడానికి తెగ ప్రయత్నిస్తోంది. జనసేన పార్టీ ఎన్డీయే కూటమిలో చేరడంతో వైసీపీని నిలువరించే అవకాశం దక్కిందని అంటున్నారు. కాగా, జనసేన ఏపీ ఎన్నికలపైనే ఫోకస్ పెట్టింది. అక్కడ గెలిస్తేనే ఆ పార్టీకి భవిష్యత్ ఉంటుంది. లేదంటే ఆ పార్టీకి కష్టాలు తప్పవు. ఈ నేపథ్యంలో తెలంగాణలో పోటీపై క్లారిటీ రావాల్సి ఉంది.