Home EXCLUSIVE Medchal District : మూడు నెలల చిన్నారి.. రూ. 4 లక్షల 50 వేలు

Medchal District : మూడు నెలల చిన్నారి.. రూ. 4 లక్షల 50 వేలు

10
Medchal District
Medchal District

Medchal District : మూడు నెలల చిన్నారిని 4 లక్షల 50 వేలకు అమ్మకానికి పెట్టిన ఓ ముఠాను మేడ్చల్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అక్షర జ్యోతి ఫౌండేషన్ కు చెందిన మహిళలు తమకు ఆడపిల్లలు కావాలని తిరుగుతుండగా పీర్జాదిగూడ కార్పొరేషన్ రామకృష్ణ నగర్ లో శోభారాణి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ లో పనిచేస్తున్న ఆర్ఎంపీని సంప్రదించారు. ఆమె మూడు నెలల చిన్నారిని రూ. 4.50 లక్షలకు ఇప్పిస్తానని చెప్పి ముందుగా వారి నుంచి రూ. 10 వేలు అడ్వాన్స్ తీసుకుంది.

మరుసటి రోజు పాప కోసం క్లినిక్ కు వస్తామని చెప్పి వారు వెళ్లిపోయారు. తర్వాత స్వచ్ఛంత సంస్థ ఈ విషయాన్ని పోలీసులకు చెప్పడంతో వారు స్పాట్ కు వచ్చి ఆర్ఎంపీ డాక్టర్ ను అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు మరికొందరు మహిళలను అరెస్టు చేసి విచారిస్తున్నారు.