Home BREAKING Minister Konda Surekha : బోనాల పండుగను వైభవంగా నిర్వహిస్తాం: మంత్రి కొండా సురేఖ

Minister Konda Surekha : బోనాల పండుగను వైభవంగా నిర్వహిస్తాం: మంత్రి కొండా సురేఖ

5
Minister Konda Surekha
Minister Konda Surekha

Minister Konda Surekha : తెలంగాణ రాష్ట్ర పండుగగా బోనాల పండుగను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. 2024 జులై 7వ తేదీ నుంచి జరిగే బోనాల పండుగ ఏర్పాట్లను మంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ బోనాల పండుగ ఏర్పాట్లపై అన్ని శాఖల సమన్వయంతో ముందుకు వెళ్తామని చెప్పారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా టెంపుల్స్ వద్ద అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వంలో లాగా అరకొర సౌకర్యాలతో కాకుండా ఈ ఏడాది మరింత వైభవంగా బోనాల పండుగను నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. రూ.25 కోట్లు ఫండ్స్ రిలీజ్ చేయించేలా సీఎం రేవంత్ తో తాను మాట్లాడుతానని అన్నారు. ఆర్టీసీ కూడా స్పెషల్ బస్సులు నడపాలని ఆదేశాలు జారీ చేస్తామన్నారు. త్వరలోనే బోనాల తేదీలు, పూర్తి సమాచారంతో క్యాలెండర్ ను విడుదల చేస్తామని పేర్కొన్నారు.