Home EXCLUSIVE Highest Polling Station : ప్రపంచంలోనే ఎత్తైన పోలింగ్ కేంద్రం ఎక్కడుందో తెలుసా..! 

Highest Polling Station : ప్రపంచంలోనే ఎత్తైన పోలింగ్ కేంద్రం ఎక్కడుందో తెలుసా..! 

11
Highest Polling Station
Highest Polling Station

Highest Polling Station : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ కేంద్రం హిమాచల్ ప్రదేశ్ లోని తాషీగంగ్ లో ఉంది. ఇది సముద్ర మట్టానికి 15,256 అడుగుల ఎత్తులో ఉంది. ఈ గ్రామంలో 52 మంది ఓటర్లు ఉన్నారు. ఆ రాష్ట్రంలో 10,000 నుంచి 12 వేల అడుగులకు పైగా ఎత్తులో 20 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలకు అధికారులు రెండురోజుల ముందుగానే చేరుకుంటారు..

సాధారణంగా పోలింగ్ కేంద్రాలు అన్ని ప్రాంతాల్లో కూడా కిందనే ఉంటాయి. కానీ ఒక్క హిమాచల్ ప్రదేశ్ లో మాత్రం 15,256 అడుగుల ఎత్తులో పోలింగ్ కేంద్రాలు ఉండడం విశేషమనీ చెప్పు కోవచ్చు.

ఎన్నికల సిబ్బంది సాధారణ ప్రాంతాల్లో ఒకరోజు ముందుగా పోలింగ్ కేంద్రానికి చేరుకుంటే హిమా చల్ ప్రదేశ్ లో మాత్రం రెండు రోజులు ముందుగా ఆ ప్రదేశానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎత్తైన ప్రాంతం కాబట్టి అక్కడికి వెళ్లాలంటే చాలా సమయం పడుతుంది.