గుజరాత్ లో దూసుకుపోతోంది భారతీయ జనతా పార్టీ. ఈరోజు గుజరాత్ , హిమాచల్ ప్రదేశ్ ల అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపు మొదలైంది. బ్యాలెట్ ఓట్లలో బీజేపీ ఆధిక్యం ప్రదర్శించింది. అంతేకాదు మొదటి రౌండ్ కూడా ప్రారంభం కావడంతో అందులో కూడా బీజేపీ ఆధిక్యం ప్రదర్శిస్తోంది. గుజరాత్ లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలుండగా 92 స్థానాలు గెలుచుకున్న వాళ్ళు అధికారంలోకి వస్తారు.
అయితే భారతీయ జనతా పార్టీ ఇక్కడ 125 స్థానాలను మించి సాధించేలా కనబడుతోంది. ప్రస్తుతం 130 కి పైగా స్థానాలలో ఆధిక్యంలో ఉంది బీజేపీ. ఇక కాంగ్రెస్ పార్టీ పెద్దగా ప్రభావం చూపించలేకపోతోంది. 40 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ ప్రభావం చూపిస్తోంది. అయితే ఇది మొదటి రౌండ్ మాత్రమే కాబట్టి తుది ఫలితాల్లో తప్పకుండా మార్పులు ఉంటాయి.
ఇక హిమాచల్ ప్రదేశ్ లో మొత్తం 68 స్థానాలుండగా అక్కడ భారతీయ జనతా పార్టీ – కాంగ్రెస్ పార్టీ నువ్వా నేనా అన్నట్లుగా పోరాఢుతున్నాయి. మధ్యాహ్నం కల్లా తుది ఫలితాలు వెల్లడి కానున్నాయి. గుజరాత్ లో అయితే మళ్ళీ కమల వికాసం ఖాయమైపోయినట్లే !