Sarayu Bold Comments :
బిగ్ బాస్ తో ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోయింది సరయు. ఆమె గురించి అంతకు ముందే సోషల్ మీడియాలో అందరికీ తెలుసు. ఎందుకంటే ఆమె బూతు మాటలతో బాగా క్రేజ్ సంపాదించుకుంది. యూట్యూబ్ మొట్టమొదటి సారిగా బూతు మాటలతో వీడియోలు చేసింది సరయు మాత్రమే. దాంతో ఒక్క సారిగా బాగా క్రేజ్ సంపాదించుకుంది.
ఆమెకు వస్తున్న క్రేజ్ తో మరింత రెచ్చిపోయింది. వరుసగా అలాంటి వీడియోలనే చేసింది. ఇప్పటికే 7 ఆర్ట్స్ యూట్యూబ్ ఛానెల్ లో ఆమె వీడియోలు వస్తూనే ఉంటాయి. కాగా సరయు బిగ్ బాస్ తర్వాత బాగా పేరు సంపాదించుకుంది. ఆమెకు ఫాలోయింగ్ కూడా బాగానే పెరిగింది. దాంతో ఆమె వీడియోలకు మరింత వ్యూస్ పెరిగాయి.
ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె పాల్గొంది. ఇందులో ఆమె మాట్లాడుతూ.. తన పర్సనల్ విషయాలను కూడా చెప్పింది. మీరు ఇంతకు ముందు ఎవరితో అయినా డేటింగ్ చేశారా అని అడగ్గా.. అవును చేశాను. ఓ అబ్బాయితో ఏడేళ్ల పాటు డేటింగ్ లో ఉన్నాను. అతనికి చాలా దగ్గరయ్యాను. శారీరకంగా కూడా చాలా సార్లు కలిశాం.
నేను ఇప్పుడు వర్జిన్ కాదు. 18 ఏళ్ల వయసులోనే నా వర్జిన్ కోల్పోయాను అంటూ సరయు బోల్డ్ గా కామెంట్లు చేసింది. దాంతో ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇలా ఆమె పర్సనల్ విషయాలను ఇంత పచ్చిగా చెబుతుందని బహుషా ఎవరూ అనుకోలేదు. కానీ ఇలాంటి కామెంట్లు చేయడం సరయుకు కొత్తేమీ కాదనే చెప్పుకోవాలి.