22.2 C
India
Sunday, September 15, 2024
More

    Last Road on Earth : నేల నింగితో కలిసే చోటు ఎక్కడో తెలుసా? ఇది భూమిపై లాస్ట్ రోడ్డు కూడా.. ప్రపంచపు అంచు అక్కడే!

    Date:

    Lost Road on Earth
    Last Road on Earth ET-69

    Last Road on Earth : మనం ఒక రోడ్డుపై వెళ్తుంటే గమ్యం ఇది అని మన ఊహకు తెలుస్తుంది. ఆ రోడ్డు కూడా మనలను అక్కడికి తీసుకెళ్తుంది. అలాంటిది రోడ్డు ముగిసిపోయిందని ఊహించుకుంటే ఎంత ఎగ్జయిటింగ్ గా ఉంటుంది కదూ.. అక్కడ భూమి ఆకాశం కలిసిపోయినట్లు ఉంటుందట.. అలాంటి రోడ్డు గురించి తెలుుకుందాం.

    ప్రపంచంలో లాస్ట్ రోడ్డు ఉండాలి.. ఆ దారి అనంతంలో కలిసిపోవాలి.. అది ఎక్కడ ఉండాలి అనే దానిపై జియాలజిస్ట్ ఒక దేశాన్ని ఎంచుకున్నారు. ఇది ప్రపంచంలోని చివరి రోడ్డు (డెడ్ ఎండ్ రోడ్)గా నిర్ధారించారు. అదే ఐరోపాలోని ‘E-69 హైవే’ అని చెబుతున్నారు.

    Narth cape
    Narth cape

    ‘E-69’ నార్వేలో ఉంది. ఇది వరల్డ్ లో లాస్ట్ రోడ్డు. దీంతో ఈ డెడ్ ఎండ్ రోడ్డును చూసేందుకు చాలా మంది ప్రజలు వస్తుంటారు. ప్రపంచంలోని చివరి రోడ్డుపై ఒక్క సారైనా ప్రయాణించాలని చాలా మంది కోరుకుంటారు. భూమిపై ఈ చివరి రహదారి ఉత్తరార్ధగోళంలో ఉంది. అంటే భూ మధ్య రేఖకు ఎగువన అన్నమాట.

    నార్వేలోని ‘E-69 హైవే’ ఉత్తర ధ్రువం దగ్గరికి వెళ్తుంది. ఈ రహదారి ఉత్తర ఐరోపాలోని నార్డ్‌ కాప్‌ను నార్వేలోని ఓల్డా ఫెవోర్డ్ గ్రామంతో అనుసంధానం చేస్తుంది. ఈ ‘E-69 హైవే’ దూరం 129 కి.మీ. 5 సొరంగాల గుండా రోడ్డు వెళ్తుంది.

    shetha
    shetha

    వీటిలో పొడవైన సొరంగం ‘నార్త్ కేప్’. దీని పొడవు 6.9 కిలో మీటర్లు. సొరంగం సముద్ర మట్టానికి 212 మీటర్ల దిగువన ఉంటుంది. దీన్నే లాస్ట్ రోడ్డు అంటారు. ఆ దారిలో వెళ్లాలంటే కొన్ని నియామాలు పాటించాలి. ఈ రూల్స్ పాటించకుంటే ఆ దారిలో వెళ్లేందుకు అనుమతించరు. ‘E-69 హైవే’లో ఒంటరిగా వెళ్లేందుకు అనుమతి లేదు.

    ఇక్కడ గాలి అత్యంత వేగంతో వీస్తుంది. చలి కూడా ఓ రేంజ్‌లో ఉంటుంది. వేసవిలో కూడా మంచు కురుస్తూనే ఉంటుంది. శీతాకాలంలో అయితే ఈ E-69 హైవే పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది. భారీ హిమపాతం, అప్పుడప్పుడు భారీ తుపానులు కూడా వస్తుంటాయి. ఇక్కడ ఎప్పుడు ఎలా ఉంటుందో అంచనా లేయలేరు. అందువల్ల ఒంటరిగా వెళ్లడం నిషేధించారట.

    E-69.3
    E-69.3

    ‘E-69 హైవే’ 1930లో ఐరోపాలోని నార్వేలో ఏర్పాటు చేయాలని ప్రణాళిక చేశారు శాస్త్రవేత్తలు. దానిని ఖరారు చేసేందుకు మరో నాలుగేళ్లు పట్టింది. 1934లో హైవే నిర్మాణం ప్రారంభమైంది. ఈ రోడ్డు నిర్మాణానికి 62 ఏళ్లు పట్టింది అంటే 1992లో పూర్తయిందన్నమాట. ఈ రహదారిని భూమిపై చివరిదని అంటారు. అనంతం వరకు వెళ్లే ఇలాంటి రోడ్లు ప్రపంచంలో చాలా ఉన్నాయని, కానీ వాటిని ఎవరూ గుర్తించలేదని, దీన్ని మాత్రం ప్రపంచం అధికారికంగా గుర్తించిందని భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Naveen Polishetty : బడా ప్రొడ్యూసర్ తో నవీన్ పొలిశెట్టి టై అప్

    Naveen Polishetty : నవీన్ పొలిశెట్టి జాతిరత్నాలు సినిమాతో తెలుగులో హీరోగా...

    Tollywood : బడ్జెట్ కంట్రోల్ ఎలా.. వరుస ప్లాఫులతో నిర్మాతలు ఉక్కిరిబిక్కిరి

    Tollywood: తెలుగు సినిమా ఇండస్ట్రీకి  ప్లాఫుల కొత్తమీ కాదు. ఏడాదికి దాదాపు...

    Hero Govindha : మంత్రి కుమార్తె ఆ స్టార్ హీరో ఇంట్లో పనిమనిషి.. విషయం తెలియగానే ఏం చేశారంటే

    Hero Govindha : హీరోలు, హీరోయిన్లు అంటే చాలా మంది అభిమానం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related