39 C
India
Wednesday, May 8, 2024
More

    Virat Dancing : డీజే టిల్లు పాటకు విరాట్ డ్యాన్స్.. ఫ్యాన్స్ కేరింతలు

    Date:

    Virat Dancing
    Virat Dancing

    Virat dancing : డీజే టిల్లు తెలుగు సినిమాల్లో ఒక సంచలనం. హిరోనే కామెడీ చేస్తూ ఆద్యంతం ఉర్రూతలూగించే ఈ మూవీలో డీజే టిల్లు పాట ఫేమస్. ఈ పాట వస్తుందంటే ఎలాంటి వారైనా స్టెప్స్ వేయాలని అనుకుంటారు. దీనికి విరాట్ కోహ్లి కూడా అతీతుడు కాడని నిరూపించుకున్నారు.

    ఏప్రిల్ 25న సన్ రైజర్స్ తో మ్యాచ్ లో విరాట్ కొహ్లి ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు డీజే టిల్లు పాట ప్లే అయింది. దీంతో ఒక్కసారి విరాట్ స్టెప్ వేశాడు. స్టేడియంలో ప్రేక్షకులు కేరింతలు పెట్టారు. విరాట్ గ్రౌండ్ లో దూకుడు స్వభావం ఉండే వ్యక్తి అయినా.. అతడిలో మంచి డ్యాన్సర్ ఉన్నారు. గతంలో వివిధ పాటలకు స్టెప్పులు వేసి అభిమానులకు ఉర్రూతలుగించాడు.

    విరాట్ కొహ్లి హుషారుకు తోడు సన్ రైజర్స్ తో మ్యాచ్ లో ఆర్సీబీ విక్టరీ సాధించి గ్రౌండ్ ను సైలెంట్ మోడ్ లోకి తీసుకెళ్లగా.. విరాట్ హాయిగా నవ్వుకున్నాడు. సన్ రైజర్స్ ఈ సీజన్ లో దూకుడుకు మారుపేరుగా మారింది. ఈ మ్యాచ్ లో విరాట్ కొహ్లి హాప్ సెంచరీతో అదరగొట్టాడు. విరాట్ ఈ సీజన్ లో భారీగానే పరుగులు సాధిస్తున్నా.. జట్టు మాత్రం పరాజయాల పాలు కావడంతో జీర్ణించుకోలేకపోతున్నాడు. ఇప్పటికే ప్లే ఆప్ దారులు మూసుకుపోయినట్లే కనిపిస్తున్నాయి. ఆర్సీబీ 9 మ్యాచుల్లో 2 విజయాలు మాత్రమే సాధించి చివరి స్థానంలో ఉంది. మిగతా అయిదు మ్యాచ్లు గెలిచినా ఆర్సీబీ ఫ్లే ఆప్స్ కు వెళ్లే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి.

    డీజే టిల్లు సినిమాతో సిద్ధు జొన్నలగడ్డ ఫేమస్ హిరో కాగా.. ఆ సినిమాలో రాధిక పాత్ర యువతరాన్ని ఆకట్టుకుంది. రాధిక అంటేనే చాలు అందరూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ సాధించడంతో టిల్లు స్క్వేర్ అభిమానుల ముందుకు తీసుకొచ్చారు. ఇది కూడా మంచి విజయాన్ని అందుకుంది. డీజే టిల్లు వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నా.. ఆ పాటకు ఉన్న క్రేజ్ ఇంకా పోలేదు.

    Share post:

    More like this
    Related

    Bihar News : ఎన్నికల కోసం 56 ఏళ్ల వయసులో పెళ్లి – భార్యకు ఎంపీ టికెట్

    Bihar News : బిహార్ లో అశోక్ మహతో (56) అనే...

    Kartika Deepam Actress : కార్తీక దీపం సీరియల్ నటికి లైంగిక వేధింపులు..పోలీసులకు ఫిర్యాదు

    Kartika Deepam Actress : సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్...

    Maharashtra : ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహారాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు – కేసు నమోదు

    Maharashtra : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మహారాష్ట్రలోని బారామతి లోక్ సభ...

    Jana Reddy : కేంద్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వం – సీఎల్పీ మాజీ నేత కె. జానారెడ్డి

    Jana Reddy : కేంద్రంలో రానున్నది రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Virat Kohli’ : విరాట్ కోహ్లి ఎంట్రీకి నేటితో 15 ఏళ్లు

    Virat Kohli' : టీమిండియా మాజీ సారధి విరాట్ కోహ్లి అంతర్జాతీయ...