37.7 C
India
Saturday, May 18, 2024
More

    TFAS Ugadi Sambaraalu : న్యూజెర్సీలో కన్నుల పండువగా ఉగాది సంబరాలు.. అలరించిన మ్యూజికల్ నైట్

    Date:

    TFAS Ugadi Sambaraalu
    TFAS Ugadi Sambaraalu

    TFAS Ugadi Sambaraalu : తెలుగు సంవత్సరాది ఉగాది పండుగను తెలుగువారు ఎక్కడున్నా వైభవంగా జరుపుకుంటారు. గత నెల 9వ తేదీన ఉగాది పర్వదినాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకున్నారు. విదేశాల్లో స్థిరపడిన తెలుగువారు సైతం తమ సంస్కృతి, సంప్రదాయ ఆచారాలను మరిచిపోకుండా దాదాపు అన్ని ప్రధాన పండుగలను నిర్వహించుకుంటారు. బతుకమ్మ, దసరా, సంక్రాంతి, ఉగాది పండుగలను సంబురంగా నిర్వహించుకుంటారు.

    ఈ నేపథ్యంలో అమెరికా న్యూజెర్సీలో ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఉగాది సంబరాల్లో భాగంగా తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ(తెలుగు కళా సమితి) మ్యూజికల్ నైట్ ను మే 3 శుక్రవారం సాయంత్రం నిర్వహించారు. న్యూజెర్సీ లోని 1050 కింగ్ జార్జెస్ పోస్ట్ రోడ్ లోని రాయల్ అల్బర్ట్స్ ప్యాలెస్ లో ఈ వేడుక కన్నుల పండువలా సాగింది. ఈ మ్యూజికల్ నైట్ లో ప్రముఖ గాయకులు కారుణ్య, మాళవిక తమ పాటలతో ఉర్రూతలూగించారు. వీరితో పాటు పలువురు కళాకారులు ఈ సంబరాల్లో అలరించారు. ఈ వేడుకకు న్యూజెర్సీలో స్థిరపడిన తెలుగు వారు భారీ సంఖ్యలో హాజరయ్యారు. సంప్రదాయ దుస్తులతో తెలుగు పల్లెల్లోనే ఉన్నామా అన్నరీతిలో ముస్తాబయ్యారు.

    కాగా, వేడుకను తెలుగు కళా సమితి వారు అద్భుతంగా నిర్వహించారని వక్తలు కొనియాడారు. అమెరికాలో ఉన్నా తెలుగు నేలపైనే ఉన్నట్టుందని, ఎక్కడికి వెళ్లినా మన సంప్రదాయాలను యువతరం సైతం పాటించడం అభినందనీయమన్నారు.  ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన ప్రతీ ఒక్కరికి  కృతజ్ఞతలు తెలిపారు.

    All Images Courtesy : Dr. Shiva Kumar Anand (Jaiswaraajya Tv & JSW Tv Global Director)

    Read more : TFAS Ugadi Sambaraalu & Musical Night PHOTOS

    Share post:

    More like this
    Related

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాపై నిషేధం

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాపై ఐపీఎల్ ఫ్రాంచైజీ నిషేధం విధించింది. ఇప్పటికే...

    RGV : సీఎం రేవంత్ రెడ్డి చెంతకు ఆర్జీవీ.. 

    RGV : సీఎం రేవంత్ రెడ్డి ఆర్జీవీ చెంతకు చేరారు. మూవీ డైరెక్టర్స్...

    Road Accident : పెళ్లి బట్టల కోసం వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం..

    - ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి Road Accident : ఆంధ్రప్రదేశ్...

    Crime News : తీర్థయాత్రకు వెళ్లి వస్తుండగా బస్సు దగ్ధం..

    - 8 మంది మృతి.. 20 మందికి గాయాలు Crime News :...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    H-1B Visa : హెచ్-1బీ వీసాదారులకు ఊరట – ఉద్యోగం కోల్పోయినా మరికొంత కాలం ఉండవచ్చు

    H-1B Visa : అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు ఊరట...

    NRI News : సూర్యపేట- ఖమ్మం హైవేపై మిస్ అయిన అమెరికా నుంచి వచ్చిన ప్రవాసుల బ్యాగులు

    NRI News : అమెరికా నుంచి వచ్చిన ప్రవాస భారతీయుల బ్యాగులు మిస్...

    Viral Video : జగన్ కు ముచ్చెమటలు పట్టించే ఎన్ఆర్ఐ యువకుడి వీడియో

    Viral Video : ఏపీలో ఎన్నికల ప్రచారం చివరకొచ్చింది. ఈ రోజు...

    Dallas : డల్లాస్ లో 7వేల మందితో అన్నమాచార్య సంకీర్తనోత్సవం..మరో రికార్డుకు సిలికానాంధ్ర రెడీ!

    Annamacharya Sankirtanotsavam in Dallas : తెలుగునేల ఎందరో మహానుబావులకు పుట్టినిల్లు....