Nithyananda: ఆధ్యాత్మిక గురువుగా గుర్తింపు సంపాదించుకొని కల్ట్ గా మారిన నిత్యానంద గతంలో టీచర్స్ గురించి మాట్లాడాడు. ఆయన ఇండియాలో ఉన్న సమయంలో ఏర్పాటు చేసిన ఒక ప్రవచనంలో గురువుల గురించి మాట్లాడాడు. ఆయన అనుకున్నది చెప్పాడా.. లేక వ్యంగంగా అన్నది అటుంచితే ఆయన ప్రవచనంలో భాగంగా అన్న మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ప్రతీ టీచర్స్ డే రోజు నిత్యానంద ఈ వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. రీసెంట్ గా టీచర్స్ డే (సెప్టెంబర్ 5) రోజున కూడా ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఆయన గురువులపై చేసిన ఫన్నీ కామెంట్ విని నవ్వకుండా ఉండలేం మరి. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..
విద్యా వ్యవస్థను ఉదహరిస్తూ .. ‘ఒక టీచర్ అన్ని సబ్జెక్టులను బోధించనప్పుడు.. ఒక స్టూడెంట్ అన్ని సబ్జెక్టులను ఎలా చదవగలడు’ అని అన్నాడు. దీంతో సభలో కొంత సేపు నవ్వులు పూచాయి. నిత్యానంత తన ప్రవచనాల్లో అప్పుడప్పుడు ఇలాటి చలోక్తులు గుప్పిస్తాడని కొందరు అంటుండగా.. విద్యా వ్యవస్థపై ఏ మాత్రం అవగాహన లేదని మరికొందరు అంటున్నారు.