31.9 C
India
Monday, May 6, 2024
More

    Rajkumar : కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్.. ఇవాళ ఆయన జయంతి

    Date:

    Rajkumar
    Rajkumar

    Rajkumar : మనదేశంలో వచ్చిన ఒక గొప్పనటుడు రాజ్ కుమార్. మన ఎన్. టి. రామారావు తరువాత అటువంటి వైవిధ్యమూ, వైశాల్యమూ, ప్రతిభ ఉన్ననటుడు రాజ్‌కుమార్‌. పౌరాణిక, జానపద, చారిత్రాత్మక, సాంఘీక పాత్రల పరంగా రామారావు తప్పితే రాజ్‌కుమార్‌కు ఉన్నన్ని పార్శ్వాలు మరోనటుడికి లేవు. రామారావుకు రాజ్‌కుమార్‌ అంటే అభిమానం.

    కన్నడ సినిమా‌ రంగంలో ఏకైక నక్షత్రం రాజ్‌కుమార్‌..
    ఏ‌ భాషా సినిమా రంగంలోనైనా ఇద్దరు‌, ముగ్గురు‌ నక్షత్రాలుంటారు. కానీ కన్నడ సినిమా రంగంలో రాజ్‌కుమార్‌ ఒక్కరే నక్షత్రం. నక్షత్రం మాత్రమే కాదు ఒక మహోన్నతమైన, అరుదైన‌ ప్రతిభ ఉన్న నటుడు ఆయన. కొన్ని సినిమాల్లో ఆయన అంతర్జాతీయ‌స్థాయి‌‌ నటనను ప్రదర్శించారు. సాక్షాత్కార, అదే కణ్ణు, ఎరడు కనసు వంటి పలు సినిమాలు ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉంటాయి.

    Body language పై ఆయనకు విశేషమైన పట్టు ఉంది. ఆంగికం, వాచికం వీటిల్లో ఆయనకు అమోఘమైన ప్రజ్ఞ ఉంది. ఆయన అభినయం మహోన్నతమైంది. గొప్ప Screen presense ఉన్న నటుడు రాజ్‌కుమార్‌. రామారావు, ఎస్. వి. రంగారావు, దిలీప్, రాజ్‌కపూర్‌. అమితాబ్, రజనికాంత్ వంటి వాళ్లు ఈ విషయంగా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినవాళ్లు.

    భక్త కుంభార సినిమాలో రాజ్‌కుమార్‌ నటన అద్వితీయంగానూ, మహోచ్చంగానూ ఉంటుంది. ఆ పాత్రను తెలుగులో నాగయ్య, నాగేశ్వరరావులు చేశారు. ఆ ఇద్దరి కన్నా రాజ్‌కుమార్‌ ఎంతో ఉన్నతంగా చేశారు. ( తెలుగువాళ్లకు కోపం వస్తే… ఆ అపరిపక్వతను పోగొట్టుకోవాల్సిన అవసరం ఉంది) జీవన చైత్ర అనే సినిమాలో ఒక గృహస్థు భక్తుడుగా మారడమూ, ఆపై యోగిలా పరిణమించడమూ రాజ్‌కుమార్‌ అసదృశంగా చేశారు. ఆ సినిమాలో “నాదమయా…” అంటు సరైన తాళ జ్ఞానంతో, ఒక విద్వాన్‌లా పాడుతూ, భక్తిపారవశ్యాన్ని అమోఘమైన ఆంగికంతో, అభినయంతో ఆయన ప్రదర్శించిన వైనం అత్యుదాత్తం. ఆయన ఆ గానం సంగీతంపరంగా ఆయన విద్వత్తును తెలియజెబుతుంది.

    200‌ సినిమాలకు పైగా తనకు పి.బి‌. శ్రీనివాస్ నేపథ్యం పాడాక రాజ్‌కుమార్‌ తనకు తానే పాడుకోవడం మొదలుపెట్టారు. తనకు తాను పాడుకుంటున్న‌ప్పుడు “పి.బి. శ్రీనివాస్ చూపించిన దారి” అని బహిరంగంగా చెప్పేవారు. “నీవు తోరిసిద దారి” (మీరు చూపించిన దారి) అని రాజ్ కుమార్ పి.బి. శ్రీనివాస్ కు కృతజ్ఞత చెప్పేవారు.

    1956లో వచ్చిన‌ ఓహిలేశ్వర సినిమాలో రాజ్ కుమార్ కు ఘంటసాల, పి.బి. శ్రీనివాస్ లు పాడారు. రాజ్‌కుమార్‌ స్వయంగా ఒక పాట పాడుకున్నారు. ఆ సినిమా‌ తరువాత
    రాజ్‌కుమార్‌ తనకు పి.బి. శ్రీనివాస్ గాత్రం, గానం సరైనవని నిర్ణయించుకున్నారు. తాను పాడకూడదనుకున్నారు. ఘంటసాలను నిరాకరించారు! అప్పటికి పి.బి. శ్రీనివాస్ ఒక‌‌ గాయకుడుగా స్థిరపడలేదు. తాను కూడా పెద్ద నటుడు కాదు. కానీ ఘంటసాల అప్పటికే దక్షిణాదిన ఒక‌ ఉన్నతస్థాయి గాయకుడు. ఆ పరిస్థితిలో రాజ్‌కుమార్‌ ఘంటసాలను కాదని, తనకు తాను వద్దనుకుని పి.బి.శ్రీనివాస్ తన గాత్రం, గానం అని నిశ్చయించుకోవడం దార్శనికత. తరువాతి రోజుల్లో వారిద్దరి సంగమం ఒక చరిత్ర అయింది. ఆ సంగమం కన్నడ సినిమాలో ఎంతో ఉన్నతమైన సంగీతాన్ని సృష్టించింది.

    కన్నడ సినిమా తొలి సూపర్‌స్టార్ రాజ్‌కుమార్‌

    కాదు పి.బి. శ్రీనివాస్! ఆశ్చర్యకరమైన విషయం ఇది. బాలెట్‌ పద్ధతిలో పి.బి. శ్రీనివాస్ కన్నడంలో తొలి సూపర్‌స్టార్ గా ఎన్నుకోబడ్డారు. అయినా రాజ్ కుమార్ పి.బి.శ్రీనివాస్ చేత 20యేళ్లు పాడించుకున్నారు! ఇది రాజ్‌కుమార్‌ ఒక నిజమైన కళాకారుడు అన్నదాన్ని తెలియజేస్తోంది. పి.బి. శ్రీనివాస్, రాజ్‌కుమార్‌ ఈ ఇద్దరూ కన్నడ సంస్కృతిలో ఒక భాగం. ఈ పరిస్థితికి రాజ్ కుమార్‌ తీసుకున్న నిర్ణయం ప్రధానమైన కారణమయింది.

    రాజ్‌కుమార్‌ నమ్రతకు పెట్టింది పేరు. చాల సరళంగా ఉంటారు. ఆయన మెడ ఎప్పుడూ బిగుసుకు పోలేదు. ఆయనకు తల బిరుసూ లేదు. ఒక షూటింగ్ సందర్భంలో కొందరు తనను కలవడానికి వస్తే, ఆ వచ్చినవాళ్లు చదువుకున్నవాళ్లని, తనకు చదువులేదని వాళ్ల కోసం షూటింగ్ సమయాన్ని వెచ్చించి వాళ్లతో కొంత సమయం గడిపారు.

    అమితాబ్, రామారావు, ఎం.జి. రామచంద్రన్ వంటి నటుల్ని పరిగణనలోకి తీసుకున్నాక కూడా, ఒక భాషకు సంబంధించి రాజ్‌కుమార్ అంత జనరంజకమైన నటుడు మనదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎవరూ లేరేమో?

    గొప్ప నటుడు జనరంజక నటుడవడం అరుదు. రాజ్‌కుమార్, ఎన్.టి. రామారావులాగా గొప్ప నటుడుగానూ, జనరంజక నటుడుగానూ విలసిల్లారు.

    రాజ్‌కుమార్‌కు ఎన్నో పురస్కారాలు, ప్రశంసలు, బిరుదులు వచ్చాయి. ‘వరనట’ అని ఆయనకు ఒక బిరుదు ఉంది. రాజ్‌కుమార్‌ జనరంజకత్వంతో మెరిసిన ఒక వర (శ్రేష్ఠమైన) నటుడు.

    రాజ్‌కుమార్‌ స్మరణలో-

     

     

     

     

    రోచిష్మాన్
    9444012279

    రాజ్‌కుమార్‌ పాడుతూ చేసిన మహోన్నతమైన అభినయం:

    Share post:

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related