Home EXCLUSIVE Office Meeting in Traffic : ట్రాఫిక్ లోనే ఆఫీస్ మీటింగ్..ఇవేం ఉద్యోగాలురా బాబూ..  

Office Meeting in Traffic : ట్రాఫిక్ లోనే ఆఫీస్ మీటింగ్..ఇవేం ఉద్యోగాలురా బాబూ..  

9
Office Meeting in Traffic
Office Meeting in Traffic

Office Meeting in Traffic : ప్రస్తుత రోజుల్లో మనిషి కూడా యంత్రంతో పోటీ పడుతున్నాడు. ఉరుకుల పరుగుల జీవితంలో విశ్రాంతి అనేది లేకుండానే రోజులు గడిచిపోతున్నాయి. హడావుడిగా పరుగులు తీయాల్సిందే. లేదంటే ఇబ్బందులే వస్తాయి. ఈనేపథ్యంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉద్యోగుల జీవితాల గురించి ఓ లుక్కేస్తే మనకు అర్థమవుతుంది. వారికి రూ. లక్షల్లో జీతాలున్నా వారి పనులు కూడా అలాగే ఉంటాయి.

ఉరుకుల పరుగుల జీవితంలో కాలంతో పాటే పోటీపడి పరుగెత్తాలి. క్షణం ఆగిపోతే మన మనుగడ ఆగిపోతుంది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు తీరిక లేకుండా గడుపుతున్నాం. ఈనేపథ్యంలో బెంగుళూరులో ఓ ఉద్యోగి ట్రాఫిక్ లోనే పడిన కష్టాలకు ప్రతిరూపంగా ఓ వీడియో వచ్చింది. అది కాస్త వైరల్ గా మారింది. వారు ఎంత నరకం అనుభవిస్తున్నారో తెలిపింది.

ట్రాఫిక్ ఇబ్బందులంటే గుర్తుకొచ్చేది బెంగుళూరు. పలు ఐటీ కంపెనీలకు నెలవు ఇది. దేశంలోని పలు ప్రాంతాల నుంచి ఇక్కడ ఉద్యోగం చేయడానికి వస్తుంటారు. నిత్యం ఇక్కడ ట్రాఫిక్ ఓ నరకమే. ఉద్యోగాల కోసం ఆఫీసులకు వెళ్లాలంటే వారు పద్మవ్యూహం ఛేదించాల్సిందే. తాజాగా ట్రాఫిక్ లో ఓ ఉద్యోగి పడుతున్న వేదనలను వీడియో అద్దం పట్టింది.

ఓ మహిళా ఉద్యోగి ఆఫీసుకు బయలుదేరింది. అంతలోనే ఆఫీసు మీటింగ్ కు హాజరు కావాలని సందేశం వచ్చింది. దీంతో తన ఫోన్ లోనే జూమ్ కాల్ లోనే మీటింగ్ లో జాయిన్ అయింది. అదే ట్రాఫిక్ లో ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు బెంగుళూరులో ఇది సహజమే అని కామెంట్లు పెడుతున్నారు.

ఇలాంటి ఘటనలు బెంగుళూరులో మామూలే. వేగంగా విస్తరిస్తున్న నగరం కాబట్టే పనులు కూడా అలాగే ఉంటాయి. క్షణాల్లోనే పనులు జరిగిపోవాలి. లేదంటే సమస్యలు వస్తాయి. అందుకే క్షణం తీరిక లేకుండా గడపడం అక్కడి వారికి అలవాటే. దానికి అనుగుణంగానే వారి కార్యాచరణ ఉంటుంది.